అన్వేషించండి

Chandrababu Speech: పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం - మహానాడులో చంద్రబాబు కీలక ప్రకటన

TDP: కడప స్టీల్ ప్లాంట్ పనులు పదిరోజుల్లో ప్రారంభమవుతాయని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత ఆయన ప్రసంగించారు.

Chandrababu Naidu speech In Mahanadu: బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి హాని జరగదని, సముద్రంలోకి వెళ్లే నీటినే మళ్లించుకుంటామని చంద్రబాబు కడప వేదికగా ప్రకటించారు. మహానాడులో మరోసారి టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికయిన తరవాత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. ఏపీ అత్యంత దిగువ రాష్ట్రమని.  ఏపీకి వరదలు వస్తే అవి సముద్రంలోకి వెళ్లిపోతాయన్నారు. ఆ నీటిని రాయలసీమకు మళ్లించుకునేందుకు బనకచర్ల నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ కేటాయింపుల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా తోడుకోబోమని స్పష్టం  చేశారు.  ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు వంటివి అని చంద్రబాబు  మరోసారి ప్రకటించారు. 

అలాగే బెంగళూరులో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పరిశ్రమను అక్కడి నుంచి తొలగించి ఏపీలో పెట్టాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారంటూ కర్ణాటకలో జరుగుతున్న ప్రచారంపైనా స్పందించారు. తాను ఎప్పుడూ అలాంటి పనులు చేయబోనని స్పష్టం చేశారు. వేరే రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు తరలించుకుపోవాలని అనుకోనన్నారు. అనంతపురం జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాల్సి ఉందన్నారు. లేపాక్షి ఏరోస్పేస్ పరిశ్రమలకు అనుకూలమని.. ఆ అంశంపైనే కేంద్రంతో చర్చించానన్నారు. 

కడప స్టీల్ ప్లాట్ పనులు పది రోజుల్లో ప్రారంభమవుతాయని ప్రకటించారు. గజంలో ఈ స్టీల్ ప్లాంట్ కు జిందాల్ శంకుస్థాపన చేశారు.కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ స్టీల్ ప్లాంట్ వల్ల మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. తెలుగుజాతి ఉన్నంతవరకు టీడీపీ ఉంటుందని చంద్రబాబు అన్నారు రానున్న 40 ఏళ్లకు ప్రణాళికలు రూపొందించుకున్నామని  తెలిపారు.  గత ఐదేళ్లు ఏపీలో శాంతిభద్రతలు లేవని, వైసీపీ హయాంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. . బాబాయిని హత్య చేసి ఆ నింద మనపై మోపాలని చూశారని అయితే తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదన్నారు. తప్పు చేసిన వారిని ఎట్టిపరిస్థితిలోనూ వదిలిపెట్టేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.  ఏపీలో గంజాయిని పూర్తిగా నియంత్రిస్తామన్నారు. శాంతిభద్రతలను ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. తప్పు చేసినవారి పట్ల చండశాసనుడిలా ఉంటానని చంద్రబాబు హెచ్చరిచారు.  రాయలసీమను ఎడారి కానివ్వమని, రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు. అలాగే, 2027 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు  ప్రకటించారు. 

మరోసారి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు

చంద్రబాబును పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  1995లో తొలిసారి  అధ్యక్ష పదవిని చేపట్టారు.  మూడు దశాబ్దాలుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.   1982లో ఎన్టీఆర్ స్థాపించినా, 1995లో పార్టీ పగ్గాలు చంద్రబాబు తీసుకున్నారు.    మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన చంద్రబాబుకు, పార్టీ అధ్యక్ష పదవిలో మరోసారి బాధ్యతలు అప్పగించడంలో కార్యకర్తలు ఏకగ్రీవంగా బాధ్యతలు అప్పగించారు. కార్యకర్తల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చంద్రబాబు తెలిపారు.      

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget