By: ABP Desam | Updated at : 02 Jun 2023 05:49 PM (IST)
టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Chandrababu : ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత అవశేష అంధ్రప్రదేశ్ మిగిలి తొమ్మిదేళ్లయినా ఏపీకి రాజధాని లేకుండా పోయిందని.. పోలవరం ప్రాజెక్ట్ నాలుగేళ్లుగా మూలన పడిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పోలవరం పై కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 2.. ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన రోజు.. టీడీపీ తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. ప్రతీ జూన్ రెండో తేదీన నవనిర్మాణ దీక్షతో ప్రజల్లో ఒక చైత్యన్యం తెచ్చామని చంద్రబాబు తెలిపారు. పోలవరం ద్వారా నదుల అనుసంధానంతో ఏపీని సస్యశ్యామలం చేయాలనుకున్నామని తెలిపారు. నవ్యాంధ్ర కోసం 2029 విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని, జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. మధ్యలో రాజధాని పెట్టామని, రాజధాని కంటిన్యూ అయి ఉంటే.. ఇప్పటికే రూ.2 లక్షల కోట్ల సంపద వచ్చుండేదని చంద్రబాబు తెలిపారు.
సన్ రైజ్ ఏపీగా మార్చుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాల భూసేకరణ చేశామని, 3 రాజధానులు పేరుతో అమరావతి నిర్మాణం నాశనం చేశారని మండిపడ్డారు. నీతిఆయోగ్ సూచనల మేరకే పోలవరం నిర్మాణం ఏపీకి అప్పజెప్పారని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేశాక.. పోలవరాన్ని జగన్ రివర్స్ చేశారు. టీడీపీ హయాంలో రూ.6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు ఏపీలోఎఫ్డీఐలు అధమ స్థానంలో ఉన్నాయన్నారు. ఏపీని ఐటీ హబ్ చేయాలనుకుంటే.. గంజాయి హబ్‌గా మార్చారు. విట్, ఎస్ఆర్ఎం, అమృత్ వంటి యూనివర్శిటీలు తెచ్చాం. విజయనగరంలో గిరిజన వర్శిటీకి మేం భూమిస్తే.. వైసీపీ ప్రభుత్వం ఆపేసిందని మండిపడ్డారు.
ఏపీకి, తెలంగాణకు ఆదాయంలో రూ.11,600 కోట్లు తేడా ఉందని తెలిపారు. పేటీఎం బ్యాచ్ దీనికేం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. ఏపీ అనాధగా మారిందని, దీన్ని పునర్నిర్మిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒకటో తేదీన జీతాలివ్వమని ఉద్యోగులు అడిగితే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు డబ్బుల పిశాచాల్లా తయారయ్యారన్నారు. అమరావతి-అనంతపూర్ ఎక్స్ప్రెస్ వేయాలని మేం భావిస్తే.. అమరావతి-ఇడుపులపాయకు ఆ రోడ్డు మార్చారు. వాళ్ల వ్యాపారాల కోసమే వైసీపీకి సీట్లు ఇచ్చినట్లు అయిందని చంద్రబాబు విశ్లేషించారు. కేసుల నుంచి బయటపడితే చాలు.. సీబీఐ అరెస్ట్ చేయకుంటే చాలని సీఎం జగన్ భావిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సీఎంకు తెలివి తేటలు ఎక్కువ. ఏ యూనివర్శిటీలో చదివారో మాత్రం చెప్పరు. టీడీపీ మేనిఫెస్టో అద్భుతమని స్వయంగా జగనే చెప్పారని చంద్రబాబు గుర్తుచేశారు.
నాడు సమైక్యాంధ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశానని.. సంపద సృష్టించి సంక్షేమ పథకాలను పేదలకు అందించామని చంద్రబాబు అన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి ఐటీ నాంది పలుకుతుందని ఆనాడే చెప్పామని.. సంస్కరణలకు సాంకేతిక జోడించి ముందుకు వెళ్లామని వివరించారు. విభజన జరిగిన తర్వాత పరిపాలన, ప్రభుత్వ విధానాల ద్వారా ఎవరికీ ఇబ్బంది లేకుండా చేశామని.. నవ నిర్మాణ దీక్ష పేరుతో నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకుని ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషిచేసినట్లు వివరించారు. సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకెళ్లామని పేర్కొన్నారు. విభజన వేళ ఆంధ్రప్రదేశ్‌కు రూ.1.10 లక్షల కోట్ల అప్పు వచ్చిందని.. రూ.16వేల కోట్లు లోటు బడ్జెట్ ఉందన్నారు. అయినా కూడా సవాళ్లను అధిగమించి 2029 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని గుర్తు చేశారు. 2029 నాటికి ఏపీ నంబర్ వన్‌గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఆనాడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మనమే నెంబర్ వన్‌గా నిలిచామని.. 2015లో రెండో స్థానంలో ఉండగా.. 2016, 2017, 2018, 2019 తర్వాత కూడా అగ్రస్థానంలో ఉన్నామని చంద్రబాబు తెలిపారు. ఈరోజు ఎఫ్‌డీఏలో రాష్ట్రం అథమ స్థానంలో ఉందన్నారు. ఐటీ ఎక్స్‌పోర్ట్స్‌లో 0.02 శాతంగా ఉందని.. అదే తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.1.83 లక్షల కోట్లుగా ఉన్నాయన్నారు. జగన్ పాలనలో యువత నిర్వీర్యం అయిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
Chandrababu News: చంద్రబాబు పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి
Supreme Court: సుప్రీంలో చంద్రబాబు, కవిత పిటిషన్ల విచారణలో మార్పు - ఇక రేపు లేదా వచ్చే వారమే!
Ap Assembly Session: నాలుగో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ప్రశ్నోత్తరాలు చేపట్టిన స్పీకర్
Andhra Pradesh: న్యాయమూర్తులపై దూషణలు: హైకోర్టులో ఏజీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు
Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!
Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా
/body>