Chandrababu : అంగన్వాడి టీచర్లు, ఆయాల సమస్యలు తీర్చే బాధ్యత టీడీపీది - భరోసా ఇచ్చిన చంద్రబాబు !
kuppam : మూడు నెలల్లో ప్రభుత్వం మారుతుందని అంగన్వాడి టీచర్లు ఆయాల సమస్యలను తీరుస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు కుప్పం పర్యటనలో ఆందోళన చేస్తున్న వారిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.
Chandrababu Assured Anganwadi Teachers : అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సమస్యలు తీర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అంగన్‌వాడీ సమస్యలను మ్యానిఫెస్టోలో పెట్టి పరిష్కరిస్తానని హమీ ఇచ్చారు. అంగన్‌వాడీలు రోడ్డు ఎక్కినా ప్రభుత్వం లెక్క పెట్టక పోవడం దారుణమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశమేనన్నారు.
సమస్యలు చెప్పుకున్న అంగన్వాడి టీచర్లు, ఆయాలు
కుప్పంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడోవ రోజు పర్యటించారు. మూడో రోజు పర్యటనలో భాగంగా ఆర్ అండ్ బి అతిధి గృహం నుండి కుప్పంకు వెళ్తున్న చంద్రబాబుకు అంగన్‌వాడీలు తమ సమస్యలు చెప్పారు. వారితో కలిసి అంగన్‌వాడీ ధర్నా కేంద్రంకు చేరుకున్న చంద్రబాబు వారికి సంపూర్ణ మద్దతు తెలిపారు. అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలకు చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. టిడిపి అధికారంలోకి రాగానే తప్పకుండా అంగన్‌వాడీ సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తాంమని హామీ ఇచ్చారు.. దాదాపు 19 రోజులుగా అంగన్‌వాడీలు రోడ్డు ఎక్కినా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణంమని ఆయన మండిపడ్డారు.. ప్రభుత్వ ఉద్యోగులందరికి న్యాయం చేసినా పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం టిడిపి పార్టియేనని, టిడిపి అధికారంలోకి రాగానే అంగన్‌వాడీ సిబ్బంది సమస్యలను మ్యానిఫెస్టోలో పెట్టి పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు
వంద రోజుల్లో ఇంటికి పోనున్న వైసీపీ ప్రభుత్వం
కేవలం 100 రోజులు మాత్రమే ఉందని, వంద రోజుల్లో వైసీపీ ప్రభుత్వంను ఇంటికి పంపే బాధ్యతను అందరూ తీసుకోవాలన్నారు. కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకం ఎక్కవ అయ్యి పోతుందని, వైసీపి నాయకుల దౌర్జన్యాలకు టిడిపి భయపడదని స్పష్టం చేశారు. వైసీపి ప్రభుత్వంకు ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయని చంద్రబాబు హెచ్చరించారు.. టిడిపి అధికారంలోకి రాగానే వైసీపి గూండాలను ఎవరిని వదిలి పెట్టంమని, వైసీపి నేతలు చేసిన అరాచకాలకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తానని చంద్రబాబు హెచ్చరించారు.
మూడో రోజు బిజీగా చంద్రబాబు
ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం పీఈఎస్ వైద్య కళాశాల సమీపంలో కనకదాస విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించి స్వయంగా భోజనం వడ్డించారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే వైకాపాను గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని ఉత్సాహాన్ని చూస్తున్నా. 35 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా. గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేస్తాం. లక్ష మెజారిటీ ఇచ్చి కుప్పం స్థాయిని మరోసారి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.