అన్వేషించండి

Bandi Sanjay: 'ఏపీలో గత పాలకులు వీరప్పన్ వారసులు' - పంగనామాలు పెట్టే నయవంచకులు పోయారన్న కేంద్ర మంత్రి బండి సంజయ్

Andhrapradesh News: ఏపీ అరాచక పాలన పోయి.. గోవిందుడి పాలన వచ్చినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం దోచేశారని.. దీనిపై నివేదిక కోరుతామని చెప్పారు.

Central Minister Bandi Sanjay Sensational Comments: ఏపీలో గత వైసీపీ పాలకులు వీరప్పన్ వారసులని.. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారని కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా సతీసమేతంగా తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన.. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టారని.. ఎర్రచందనం దోపిడీతో సర్కారుకో అప్పులిచ్చే స్థాయికి ఎదిగారని అన్నారు. నయవంచకులు పోయి.. స్వామి వారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని తెలిపారు. గత అరాచక ప్రభుత్వంలో స్వామి వారి నిధులు పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని మండిపడ్డారు.

'ఆ దోపిడీపై నివేదిక' 

శేషాచలం కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతామని.. దాని ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ అన్నారు. 'ఎర్రచందనం అక్రమ రవాణాపై గతంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, తిరుపతి బీజేపీ నాయకులు అనేక పోరాటాలు చేశారు. నాస్తికులకు, అన్య మతస్థులకు పదవులిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారు. ఏడుకొండలను రెండు కొండలుగా మార్చాలనుకున్న అన్యమత పాలన పోయింది. అరాచక పాలన పోయి గోవిందుడి పాలన వచ్చింది. ఇన్నాళ్లు భక్తులు ఎదుర్కొన్న సమస్యలు తొలగి పరిస్థితులు చక్కబడ్డాయి. స్వామి వారి ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటాం. ప్రధాని మోదీ దేశాన్ని విశ్వగురువుగా చేసేందుకు కృషి చేస్తున్నారు. ఆయన సారథ్యంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.' అని బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా, కేంద్రం హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బండి సంజయ్ తిరుమలను సందర్శించడం ఇదే తొలిసారి.

Also Read: Chandra Babu: కేంద్రం ముందు చంద్రబాబు భారీ డిమాండ్- సంచలనం రేపుతున్న బ్లూమ్‌బర్గ్‌ స్టోరీ- తెలంగాణ గమనించాలన్న కేటీఆర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Manchu Mohan Babu Family Issue : ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
Manchu Mohan Babu Family Issue: మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్కేజ్రీవాల్ ఇంటి వీడియో షేర్ చేసిన బీజేపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Manchu Mohan Babu Family Issue : ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
Manchu Mohan Babu Family Issue: మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
Home Minister on CIBMS: స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
Pushpa 2: 'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
7G The Dark Story OTT Telugu: ఓటీటీలోకి '7/జి'... ఇది బృందావన కాలనీ కాదు, ఆ హీరోయిన్ సోనియా హారర్ సినిమా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి '7/జి'... ఇది బృందావన కాలనీ కాదు, ఆ హీరోయిన్ సోనియా హారర్ సినిమా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Mushtaq Khan Kidnapped: కిడ్నాపర్ల చేతిలో 12 గంటలు చిత్ర హింసలు అనుభవించిన బాలీవుడ్ నటుడు... చివరకు ఏమైందంటే?
కిడ్నాపర్ల చేతిలో 12 గంటలు చిత్ర హింసలు అనుభవించిన బాలీవుడ్ నటుడు... చివరకు ఏమైందంటే?
Embed widget