అన్వేషించండి

PG Medical Seats in AP: ఏపీకి 630 పీజీ వైద్య సీట్లు - ఆనందంలో వైద్య విద్యార్థులు!

PG Medical Seats in AP: ఏపీలోని 11 మెడికల్ కళాశాలకు మొత్తం 630 పీజీ వైద్య సీట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అత్యధికంగా ఆంధ్రా మెడికల్ కాలేజీకి 128 సీట్లకు ఆమోద ముద్ర వేసింది.

PG Medical Seats in AP: ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకేసారి 630 పీజీ వైద్య సీట్లను రాష్ట్రానికి కేటాయించింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ అండర్ సెక్రటరీ చందన్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతిస్తూ... లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా పీజీ వైద్య విద్య సీట్లు పెంటేందుకు అవసరమైన మైలిక వసతుల కల్పనకు రూ.453.6 కోట్లు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అనుతించినట్లు తెలిపారు. ఈ మేరకు ఎంఓయూ పంపిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇందుకు ఏపీ సర్కారు కళాశాల వారీగా ఎంఓయూకు ఆమోదం తెలపాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలలు రెండు నెలల కిందర సెంట్రల్ స్పాన్సర్ షిప్ కింద 688 సీట్లకు ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ 630 పీజీ వైద్య సీట్లకు ఆమోద ముద్ర వేసింది. 

కళాశాలల వారీగా కొత్తగా వచ్చిన పీజీ సీట్లు..

విశాఖ ఏఎంసీ కాలేజీకి 128, ఒంగోలు జీఎంసీకి 79, తిరుపతి ఎస్వీఎంసీ కాలేజీకి 75, విజయవాడ సిద్ధార్థ కళాశాలకు 71, కడప జీఎంసీకి 69, అనంతపురం జీఎంసీ కాలేజీకి 65, కాకినాడ ఆర్ఎంసీ కళాశాలకి 46, కర్నూల్ కేఎంసీ కాలేజీకి 41, గుంటూరు జీఎంసీ కళాశాలకి 34, శ్రీకాకుళం జీఎంసీకి 17, నెల్లూరు ఏపీఎస్ఆర్ కాలేజీ 5 సీట్లకు ఆర్థిక సాం చేస్తున్నట్లు తెలిపారు. 

ఇన్ని సీట్ల కేటాయించడానికి కారణం ఏంటంటే..?

రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరిపినందునే పీజీ సీట్లు మంజూరు చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. గత మూడున్నరేళ్లలో దాదాపు 455 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను శాశ్వత ప్రతిపాదికన నియమించారు. 2,500 మందికి పైగా పారామెడికల్ సిబ్బందిని నియమించారు. అలాగే నాడు-నేడులో భాగంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇవన్నీ చేయడం వల్లనే కేంద్రం కొత్త పీజీ వైద్య సీట్లకు ఆమోద ముద్ర వేసింది. తాజాగా మంజూరైన సీట్లలో జనరల్ మెడిసన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ ఇలా సుమారు 18 విభాగాలకు సంబంధించిన పీజీ వైద్య సీట్లను ఉన్నాయి. అత్యధికంగా ఆంధ్రా మెడికల్ కళాశాలకు 128 సీట్లు రాగా.. అత్యల్పంగా నెల్లూరు మెడికల్ కలాజేకి 5 సీట్లు వచ్చాయి. 

సూపర్ స్పెషాలిటీ సేవలు.. 

కొత్తగా పీజీ వైద్య సీట్లతో పాటు సూపర్ స్పెషాలిటీ సీట్లు కూడా వచ్చాయని కర్నూల్ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్, డాక్టర్ హరిచరణ్ అన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా కొత్తగా సీట్లు వచ్చాయని... దీని వల్ల సామాన్యులకు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పరిధిలో సీట్లు పెరగడం పేద వైద్య విద్యార్థులకు మంచి పరిణామం అన్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget