By: ABP Desam | Updated at : 12 Dec 2022 05:05 PM (IST)
పోలవరం పూర్తి కాదు - హోదా రాదు !
AP News In Parlament : ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రెండు కీలక అంశాలపై పార్లమెంట్‌లో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ రెండు అంశాల్లో ఒకటి ఏపీ జీవనాడిగా పేరున్న పోలవరం.. మరొకటి ఏపీలో ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్ చెప్పిన ప్రత్యేకహోదా. అయితే ఈ రెండింటి విషయంలోనూ కేంద్రం పాజిటివ్‌గా స్పందించలేదు.
పోలవరం గడువులోపు పూర్తి కావడం కష్టమే !
నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చు, జాప్యంపై రాజ్యసభలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ ప్రశ్న అడిగారు. దీనికి కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానం ఇచ్చారు. పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతోందా అని ఎంపీ ప్రశ్నించగా.. షెడ్యూల్ ప్రకారం 2024 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. కానీ, వివిధ కారణాల దృష్ట్యా ఈ గడువులోగా ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమని స్పష్టం చేశారు.
పోలవరానికి ఇవ్వాల్సింది రూ. 2,441 కోట్లు మాత్రమే !
2019 నుంచి ఇప్పటి వరకు 6461.88 కోట్లు ఏపీ ప్రభుత్వానికి విడుదల చేయడం జరిగిందని, 2013-14 అంచనాల ప్రకారం రూ. 29,027.95 కోట్లు ఉండగా, 2017-18 అంచనాల ప్రకారం రూ. 47,725.74 కోట్లు అయిందని బిశ్వేశ్వర్ తుడు అన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు కోసం రూ. 6,461.88 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. 2016లో కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం మేరకు 100 శాతం ఇరిగేషన్ కాంపోనెంట్ నిధులను కేంద్రం తిరిగి చెల్లిస్తుందని.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ. 15,667.90 కోట్లు అన్నారు. ఇందులో ఇప్పటికే రూ. 13,226.04 కోట్లు చెల్లించామని, ఇంకా మిగిలిన బ్యాలెన్స్ నిధులు రూ. 2,441 కోట్లు మాత్రమేనని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
ప్రత్యేకహోదా ప్రశ్నే లేదన్న కేంద్రం !
ప్రత్యేకహోదా అంశంపైనా సుభాష్ చంద్రబోస్ ప్రశ్న వేశారు. దీనికి కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించింది. కానీ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే 2015-20 మధ్య రాష్ట్రాలకు పంచే పన్నుల వాటాను 32 శాతం నుంచి 42శాతానికి కేంద్రం పెంచింది. దీనికి కొనసాగింపుగా 15వ ఆర్థిక సంఘం కూడా 41శాతం పన్నుల వాటాకు సిఫార్సు చేసింది. నిధుల పంపిణీ ద్వారా వీలైనంత మేరకు ప్రతి రాష్ట్రానికి వనరులు అందించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది. నిధుల పంపిణీ తరువాత కూడా వనరుల లోటు ఉండే రాష్ట్రాలకు.. రెవెన్యూ లోటు పూడ్చేందుకు గ్రాంట్స్ అందిస్తోందని అందుకే ప్రత్యేకహోదాను ఇప్పుడు ఎవరికీ కల్పించడం లేదని కేంద్రం తెలిపింది.
ఒకే రోజు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ .. రెండు ఏపీ కీలక సమస్యలకు.. నిరాశజనకమైన మాధానాలు ప్రశ్నాల ద్వారా చెప్పించారు.
Minister Dharmana Prasadarao : చంద్రబాబు కన్నా ముందే వాలంటీర్లు తుపాకీ పేల్చాలి, ఎవరికి ఓటు వెయ్యాలో చెప్పే హక్కు మీకుంది - మంత్రి ధర్మాన
Jagananna Videshi Vidya Deevena : టీడీపీ నేత కుమార్తెకు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఆర్థికసాయం
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Guntur Hospital: ఆ ఆస్పత్రిలో ఐదేళ్లుగా ఎలుకలపై యుద్ధం - కోట్లు ఖర్చయ్యాయి కానీ ఇప్పటికీ ...
AP News : సైకిల్ పై దేశవ్యాప్తంగా యాత్ర - రూ. 10 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ !
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్
Turkey Earthquake : అల్లకల్లోలమైన టర్కీ, సిరియా- ప్రకృతి కోపానికి 2300 మంది మృతి!