BJP On Jagan : ఈవీఎంలతోనే కదా ఇప్పటి వరకూ గెలిచింది - జగన్‌కు ఏపీ బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
AP BJP : హర్యానా ఎన్నికల్లో ఈవీఎంలపై జగన్ వ్యక్తం చేసిన అనుమానాలపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకూ వచ్చిన విజయాలు ఈవీఎంల ద్వారానేనని గుర్తు చేశారు.
AP BJP Vishnu On jagan : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో గోల్ మాల్ జరిగిందన్న కాంగ్రెస్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ జగన్ చేసిన ట్వీట్‌పై ఏపీ బీజేపీ తీవ్రంగా స్పందించింది. గెలిచినప్పుడు ఈవీఎంలు మంచివని.. ఓడిపోయినప్పుడు మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ సూటి ప్రశ్నలు సంధిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. హర్యానా ఎన్నికలపై జగన్ పెట్టిన ట్వీట్‌కు పూర్తి వివరాలతో రిప్లయ్ ఇచ్చారు.
The @YSRCParty was launched in 2011.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) October 9, 2024
Since then -
It won 70 seats in 2014 assembly elections of Andhra Pradesh.
9 seats in 2014 Lok sabha elections.
151 seats in assembly elections in 2019.
22 seats in 2014 lok sabha elections.
Total MPs till now = 35
Total MLAs till now = 232… https://t.co/OVKRhPopkR
2011లో వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుండి 2014లో 70 అసెంబ్లీ, 9 పార్లమెంట్ సీట్లు ఈవీఎంలతో గెలిచారని 2024లో ఏకంగా 151 అసెంబ్లీ, 22 లోక్ సభ సీట్లను కూడా ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లోనే గెలిచారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. అదే ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతోనే ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని కూడా విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. ఈవీఎంలపై నిందలు వేయడం కన్నా.. గ్రౌండ్ వర్క్ చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు.
ప్రకటన,
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) October 9, 2024
తేది : 09, అక్టోబర్ 2024. విజయవాడ .
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు మీరు, మీ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలి.@ysjagan
మీ నాయకత్వంలో YSRCP పార్టీ 2011లో ప్రారంభమైంది. అప్పటి నుండి అంటే 2011 నుండి జరిగిన ఉప ఎన్నికల్లో మీరు కోన్ని సీట్లు, అలాగే 2014లో జరిగిన… https://t.co/rLFJGGfj6R
ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ తీరునూ విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్-యన్ సి పీ, జమ్ముకశ్మీర్ గెలిచింది, అక్కడ EVMలు బాగా పనిచేసాయి, హరియాణాలో కాంగ్రెస్ ఓడిపోయింది అక్కడ సరగా పనిచేయలేదు? కాంగ్రెస్ బృందం, కర్నాటక, తెలంగాణ ఫలితాలపై ఈసీకి ఎందుకు పిర్యాదు చేయరని విష్ణు ప్రశ్నించారు.
కాంగ్రెస్-యన్ సి పీ, జమ్ముకశ్మీర్ గెలిచింది, అక్కడ #EVM బాగా పనిచేసాయి, హరియాణాలో కాంగ్రెస్ ఓడిపోయింది అక్కడ సరగా పనిచేయలేదు?
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) October 9, 2024
కాంగ్రెస్ బృందం, కర్నాటక, తెలంగాణ ఫలితాలపై ఈసీకి #ElectionResults పైన ఎందుకు పిర్యాదు చేయరు ?
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని మార్చుకోండి!
ఈవీఎంలపై కాంగ్రెస్ అనుమానాలను సొంత పార్టీ మిత్రులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ.. జగన్ వంటి వారు సపోర్టు చేస్తున్నారు. అందుకే ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.