Bird Flu Symptoms: నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం - వేలాది కోళ్లు మృత్యువాత, చికెన్ షాపుల మూసివేతకు ఆదేశం
Nellore News: నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో కోళ్లు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఆయా ప్రాంతాల్లో చికెన్ షాపుల మూసివేతకు ఆదేశాలిచ్చింది.
Bird Flu Symptoms Erupted in Nellore District: నెల్లూరు (Nellore) జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో (BirdFlu) వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో, పశు సంవర్థక శాఖ అధికారులు, యంత్రాంగం అప్రమత్తమయ్యారు. కోళ్లకు సంబంధించిన శాంపిల్స్ ను భోపాల్ లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు. నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో వేలాది కోళ్లు చనిపోయాయి. వీటిని పరిశీలించిన అధికారులు బర్డ్ ఫ్లూతోనే మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. కోళ్ల కళేబరాల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పంపించారు. ఈ నేపథ్యంలో కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10 కి.మీల పరిధిలోని ప్రాంతాల్లో 3 రోజుల పాటు చికెన్ షాపులు మూసివేయాలని.. కిలో మీటర్ పరిధిలోని ప్రాంతాల్లో చికెన్ షాపులు 3 నెలల పాటు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్దేశించారు.