By: ABP Desam | Updated at : 07 Aug 2023 12:17 PM (IST)
టీటీడీ పాలకమండలి సమావేశం
Bhumana Karunakar Reddy: టీటీడీ పాలక మండలి ఛైర్మన్‌గా నియమితులపై భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం మొదటి సారి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, ఆశీర్వాదం పొందారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ఆలయ వెలుపల భూమనకు భక్తులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేశారు. రెండో సారి టీటీడీ చైర్మన్‌గా నియమితులు కావడం శ్రీవారి ఆశీర్వాద బలమన్నారు. ఈ నెల 8వ తేదీ వైవీ సుబ్బారెడ్డి పాలకమండలి గడువు ముగియనుంది. 10వ తేదీ టీటీడీ నూతన పాలక మండలి ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అంతకు ముందు ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని నూతన పాలక మండలి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శాలువతో సత్కరించారు. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగే పాలకమండలి సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడిగా పాలకమండలి సమావేశంలో పాల్గొన్నారు.
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని చివరి పాలకమండలి సమావేశం సోమవారం ప్రారంభమైంది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ప్రారంభంమైన పాలక మండలి సమావేశంలో పాలకమండలి సభ్యులందరూ పాల్గొన్నారు. రేపటితో వైవీసుబ్బారెడ్డి పాలక మండలి గడువు ముగియనుండడంతో నేడు పాలక మండలి సమావేశంలో దాదాపు 75 అంశాలతో కూడిన ఆజెండాని టీటీడీ అధికారులు సిద్ధం చేశారు.
ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో నిర్వహించనున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై పాలకమండలి చర్చ జరుగనుంది. ల్యాబ్ ఆధునీకరణకు రూ.5 కోట్లు కేటాయింపుపై చర్చ జరుగనుంది. దాదాపు 1,000 కంప్యూటర్ల కొనుగోలు టెండర్ ఆమోదంపై పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది. ఇక పలు ముడి సరుకులు కొనుగోలు, ఇంజనీరింగ్ పనులకు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలపనుంది.
రెండో సారి అవకాశం
గతంలో భూమన ఓ సారి 2006 నుంచి 2008 మధ్య కాలంలో టీటీడీ చైర్మన్ గా భూమన సేవలు అందించారు. తాజాగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీటీడీ చైర్మన్‌గా శ్రీవారికి సేవ చేసే భాగ్యం రావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు.
రాజకీయ వ్యవహారాలు చూడనున్న వైవీ
ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయ వ్యవహారాలు చూడనున్నారని సమాచారం. ఈ నెల 8 తేదీతో రెండు సార్లు అంటే నాలుగేళ్ల పదవి కాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమనను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. గతంలోనూ భూమన టీటీడీ ఛైర్మన్‌గా పని చేశారు.
YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి, కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్
SSC Exams: పదోతరగతి పరీక్షల్లో 'కాంపోజిట్' పేపర్ కొనసాగింపు, రద్దుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం
Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు వేసిన లోకేష్- ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు
రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు సీఐడీ రెడీ
AP Students: అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించిన ఏపీ విద్యార్థులు - నేటితో ముగిసిన యూఎస్ఏ పర్యటన
World Cup 2023: హైదరాబాద్‌లో పాక్xకివీస్ వార్మప్ మ్యాచ్! వర్షం కురిసే ఛాన్స్!
Skanda Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర ‘స్కంద‘ ధూంధాం, రామ్ పోతినేని కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్!
ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్ - సరిహద్దుల్లో భారీ భద్రత
Vivek Ramaswamy: అక్రమ వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తున్నా:వివేక్ రామస్వామి
/body>