అన్వేషించండి

Hindupuram Bundh : హిందూపురంలో రెడ్డి సంఘం బంద్ - ఉక్కుపాదం మోపిన పోలీసులు ! బాలకృష్ణ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ?

హిందూపురం నియోజకవర్గంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బంద్ పాటించారు. చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య కేసులో ఎమ్మెల్సీని నిందితుడిగా చేయాలని డిమాండ్ చేశారు.


Hindupuram Bundh :   హిందూపురం నియోజకవర్గంలో అఖిలపక్ష పార్టీల నాయకులు బంద్ పాటించారు. అధికార వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులతో పాటు రెడ్డి సంఘం నేతలు ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. కొద్దిరోజుల కిందట వైఎస్ఆర్‌సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో అసలైన నిందితులపై కేసులు పెట్టలేదని.. అరెస్టులు చేయలేదని ఆరోపిస్తూ రెడ్డి సంఘం నాయకులు బంద్‌కు పిలుపునిచ్చారు. సోమవారం బంద్ నిర్వహించాలని హిందూపురం మొత్తం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో  పోలీసులు అప్రమత్తమైన నియోజకవర్గం మొత్తం పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు.  హత్యకు నిరసనగా సోమవారం తలపెట్టిన బంద్‌లో భాగంగా బంద్‌ నిర్వహించేందుకు బయలుదేరిన రెడ్డి సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌ రెడ్డి, వైసిపి నాయకులు పరమేశ్వర్‌ రెడ్డి, మదన గోపాల రెడ్డితోపాటు మరో ఇద్దరిని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రామకృష్ణారెడ్డి హత్యకు ప్రధాన కారకులైన ఎమ్మెల్సీ ఇక్బాల్‌, సిఐ జిటి నాయుడు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ... రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో రెడ్డి సంఘం నేతలు హిందూపురం పట్టణ బంద్‌ కు పిలుపునిచ్చారు. ఈ రెడ్డి సంఘంలో అన్ని పార్టీల నేతలూ ఉన్నారు.  బందుకు ఎలాంటి అనుమతులు లేవని డీఎస్పీ రమాకాంత ప్రకటించారు.   ఈ బందుకు కొన్ని వ్యాపార వర్గాలు మద్దతు పలికి వారి షాపులను మూసేశారు. ఈక్రమంలో బంద్‌ను భగం చేయడానికి పోలీసులు భారీగా పట్టణంలో మోహరించారు. పట్టణ ప్రధాన రహదారుల్లో పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. బంద్ విఫలం చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు బంద్‌ ప్రభావం ప్రజలపై పడకుండా ఎక్కడికక్కడ కట్టడి చేశారు.

వైసీపీ లీడర్‌ రామకృష్ణారెడ్డి హత్యపై ఇప్పటికే అనే అనుమానాలు నెలకొన్నాయి. కొన్ని రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే హత్య జరిగి మూడు వారాలవుతున్నా.. ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు.  మర్డర్‌ జరిగిన మూడు వారాలకు నిందితుల అరెస్ట్‌ చూపించిన పోలీసులు హత్యను వైసీపీలోని ప్రత్యర్థి వర్గమే చేసిందని ప్రకటించారు. అయితే మాజీ పోలీస్‌ అధికారి, ఎమ్మెల్సీ షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌పై ఆరోపణలు వచ్చాయి. హత్య జరిగిన వెంటనే రామకృష్ణారెడ్డి తల్లి నారాయణమ్మ.. ఎమ్మెల్సీ పైనే ఆరోపణలు చేస్తున్నారు.  హత్య జరిగిన 20 రోజుల తర్వాత పోలీసులు  హత్యలో ప్రత్యక్షంగా ఐదుగురు పాల్గొన్నారని, ఐదుగురు సహకరించారని, ఆరుగురు ప్రోత్సహించారని, ఒకరు ఆశ్రయం కల్పించారని పోలీసులు గుర్తించారు. కానీ ఎమ్మెల్సీ ఇక్బార్ పేరు మాత్రం లేదు. 

దీంతో రెడ్డి సంఘం నేతలు  ఈ కేసులో నిజమైన నిందితులను అరెస్ట్ చేసే వరకు తాము వెనక్కు తగ్గేది లేదు అంటున్నారు నేతలు. బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించిన విధంగా ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ను ఏ1, గోపికృష్ణను ఏ2గా, సీఐ జీటీ నాయుడును ఏ3 గా కేసు నమోదు చేసి సీబీఐతో విచారణ చేయించాలన్నది తమ ప్రధాన డిమాండ్ అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆందోళన కారులు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలివ్వాలంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget