అన్వేషించండి

Atchannaidu: బస్సులు ఇవ్వకపోతే న్యాయపోరాటమే, ఏపీఎస్‌ఆర్టీసీకి అచ్చెన్నాయుడు వార్నింగ్

Andhra Pradesh: ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నాయి. ఈ సభకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.

APSRTC: అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ-జనసేన కూటమి స్పీడ్ పెంచింది. ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే రా.. కదలి.. రా పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుండగా.. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఇక చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు టీడీపీతో పాటు జనసేన నేతల, కార్యకర్తలు కూడా హాజరవుతున్నారు. ఇక టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడి బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నాయి.

ఈ నెల 17న చిలకలూరిపేటలో సభ

ఇటీవల తాడేపల్లిగూడెంలో జెండా పేరుతో టీడీపీ-జనసేన కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించాయి. ఈ సభలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. అలాగే మంగళగిరిలో ఇటీవల జయహో బీసీ పేరుతో బహిరంగ సభ నిర్వహించగా.. ఈ సభలో చంద్రబాబు, పవన్ కలిసి బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అయితే చంద్రబాబు, పవన్ కలిసి మరిన్ని బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అలాగే పలు కీలక ప్రకటనలు కూడా చేయనున్నారు .దీంతో ఈ సభకు భారీగా జనసమీకరణ చేయాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి.

అద్దె బస్సులు ఇవ్వండి

ఈ క్రమంలో సభలకు జనాలను తరలించేందుకు అద్దె బస్సులు ఇవ్వాల్సిందిగా ఏపీఎస్‌ఆర్టీసీకి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇవాళ లేఖ రాశారు. చిలకలూరిపేటలో తలపెట్టిన టీడీపీ, జనసేన ఉమ్మడి సభకు బస్సులు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అధికార వైసీపీ సభలకే ఆర్టీసీ బస్సులను ఇస్తున్నారని, ప్రతిపక్షాల సభలకు ఎందుకు ఇవ్వడం లేదని ఇందులో ప్రశ్నించారు. ప్రతిపక్షాల పట్ల విపక్షపూరితంగా వ్యవహరిస్తే న్యాయపోరాటానికి సిద్దమని హెచ్చరించారు. ఈ సభకు లక్షలాదిగా స్వచ్చంధంగా ప్రజలు తరలివస్తారని, వాళ్లు తిరిగి ఇంటికి వెళ్లాలంటే రవాణా సౌకర్యం అత్యవసరమని అన్నారు. గతంలో అనేకసార్లు టీడీపీ సభలకు అద్దె బస్సులు కావాలని కోరినా ఇవ్వలేదని, వైసీపీ సభల కోసం మాత్రం కేటాయించారని  తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో తగదన్నారు. బస్సులు అద్దెకు ఇవ్వకపోతే ఎన్నికల సంఘాన్ని లేఖ రాస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.

ఆర్డీసీ ఎండీ తగిన మూల్యం చెల్లించుకుంటారు

తమ సభలకు బస్సులు కేటాయించకపోతే ఆర్టీసీ ఎండీ భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో తప్పు చేసిన ఇతర  అధికారుల మాదిరిగానే ఆయన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. అందరినీ సమానంగా చూడాలని తాము కోరుతున్నామన్నారు. బస్సులు ఇవ్వకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. కాగా గురువారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి నాదెండ్ల మనోహర్ వచ్చారు. టీడీపీ, జనసేన ఉమ్మడి సభ నిర్వహణపై అచ్చెన్నాయుడితో చర్చించారు. అనంతరం ఇరువురు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget