అన్వేషించండి

Breaking News Live Telugu Updates: బిహార్‌లో రేపు కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: బిహార్‌లో రేపు కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

Background

వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. అల్పపీడనం ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్ గఢ్ వైపు కదులుతూ మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి నైరుతి దిశగా వంగి ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలకు పలు జిల్లాల్లో రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. తీరం వెంట బలమైన గాలులు గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. 

తెలంగాణలో భారీ వర్షాలు
అల్పపీడనం తీవ్రరూపం దాల్చడంతో దాని ప్రభావం రాష్ట్రంలో ఉంది. మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా జల్లులు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయిని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు భారీ వర్షాలతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప రెండు మూడు రోజులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట వరంగల్ రూరల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాలలో ఎడతెరిపి లేకుండా జల్లులు పడుతున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. 

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది. అదే సమయంలో తీరంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంట గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల మోస్తరు వర్షం పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాలోలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని ప్రజలను హెచ్చరించారు.

హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

20:30 PM (IST)  •  09 Aug 2022

ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి- తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలు

నల్లగొండలోని ఫారెస్ట్ పార్క్‌లో మంగళవారం మధ్యాహ్నం ఓ యువతిపై యువకుడు దాడి చేశాడు. ప్రేమ పేరుతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.  కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. రోహిత్ అనే 21 ఏళ్ల యువకుడు ప్రేమ పేరుతో నవ్య అనే అమ్మాయి వెంట పడుతున్నాడు. ఇతను ఎన్జీ కాలేజీలో బీబీఏ సెకండియర్ చదువుతున్నాడు. ఏడు నెలల నుంచి నవ్యను వేధిస్తున్నాడు. ప్రేమిస్తున్నానని... తననే ప్రేమించాలని టార్చర్ చేస్తున్నాడు.

మంగళవారం నవ్య తన ఫ్రెండ్ శ్రేష్ఠతో నందుసాయి అనే స్నేహితుడిని కలిసేందుకు వెళ్ళారు. అక్కడకు రోహిత్ కూడా వచ్చాడు. నవ్యతో పర్సనల్‌గా మాట్లాడాలని పక్కకు తీసుకెళ్లాడు. ప్లాన్డ్‌గా వచ్చిన రోహిత్‌ నవ్యను పక్కకు తీసుకెళ్లి... తనతో తెచ్చుకున్న కత్తితో మెరుపుదాడి చేశాడు. ఆమెపై విచక్షణారహితంగా కడుపు, చేతులు, కాళ్ళు, మొహంపై పొడిచాడు. అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. తను తెచ్చుకున్న వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పరారయ్యాడు.

ఇదంతా చూసిన సాయి, శ్రేష్ఠ వెంటనే పరుగెత్తుకొని వచ్చి నవ్యను అప్సత్రికి తరలించారు. ప్రస్తుతం నవ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని రోహిత్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు.

18:55 PM (IST)  •  09 Aug 2022

టెన్నిస్ కు సెరెనా విలియమ్స్ గుడ్ బై! 

Serena Williams : లెజెండరీ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తన కెరీర్‌ను ముగించనుంది. యూఎస్ ఓపెన్ అనంతరం టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సెరెనా విలియమ్స్ తన ఇన్ స్టా గ్రామ్ పోస్టులో తెలిపింది. వోగ్ కవర్ పేజ్ ను పోస్టు చేస్తూ ఈ విషయాన్ని తెలిపింది. 

18:27 PM (IST)  •  09 Aug 2022

నల్గొండలో యువతి గొంతు కోసిన యువకుడు 

Nalgonda News : నల్గొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. కత్తితో యువతి గొంతు కోసి పరారయ్యాడు. 

 

18:27 PM (IST)  •  09 Aug 2022

నల్గొండలో యువతి గొంతు కోసిన యువకుడు 

Nalgonda News : నల్గొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. కత్తితో యువతి గొంతు కోసి పరారయ్యాడు. 

 

15:53 PM (IST)  •  09 Aug 2022

బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా 

Nitish Kumar Resign : బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్ కు తన రాజీనామాను నితీష్ కుమార్ సమర్పించారు. ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నారు. 

14:44 PM (IST)  •  09 Aug 2022

ఈ నెల 11న తెలంగాణ కేబినెట్ భేటీ 

TS Cabinet Meet : ఈ నెల 11న తెలంగాణ కేబినేట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంత్రి మండలి సమావేశం జరగనుంది. వివిధ పథకాలకు వనరుల సమీకరణ సహా ఇతర అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. 

13:45 PM (IST)  •  09 Aug 2022

Kuppam News: ఉప్పు రాళ్ళతో శ్రీనివాసుడి చిత్రం

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై అపారమైన భక్తి భావంతో కుప్పంకు చేందిన పురుషోత్తం అనే యువకుడు రంగులు కలిపిన ఉప్పు రాళ్ళతో శ్రీనివాసుడి చిత్రాన్ని రూపొందించాడు.. ఇప్పటికే పలు ఆధ్యాత్మిక , సేవా కార్యక్రమాల్లో పాల్గోన్న పురుషోత్తం వివిధ దేవతామూర్తుల చిత్రాలకు కళ్ళకు కట్టినట్లు తీర్చి దిద్ది ప్రముఖుల వద్ద నుండి ప్రసంశలు అందుకున్నాడు.. ఇక రియల్ హీరోగా పేరుగాంచిన యాక్టర్ సోనూ సూద్ చిత్రాన్ని సాల్ట్ ఆర్ట్ ద్వారా రూపొందించి చిత్తూరు జిల్లా వాసులను ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు పురుషోత్తం.. ఇప్పటి వరకూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మొగా స్టార్ చిరంజీవి, సోనూ సూద్, సచిన్ టెండూల్కర్, సిరి వెన్నెల సీతారామ శాస్త్రీ, అలాగే స్వతంత్ర ఉద్యమ కారులు గాంధీ, నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పటేల్, టంగుటూరు ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాముల చిత్రాలు, దేవతామూర్తులైన శ్రీ వేంకటేశ్వర స్వామి, వినాయకుడు, కాళిమాత, పరమశివుడు వంటి చిత్రాలను సాల్ట్ ఆర్ట్ ద్వారా చిత్రాలను అద్భుతంగా రూపొందిస్తున్నాడు..ఇక తాజాగా పురుషోత్తం ఏడు కొండల్లో కొలువైయున్న శ్రీనివాసుడి సాల్ట్ ఆర్ట్ ద్వారా ఎంతో అందంగా రూపొందించాడు.. ఈ చిత్రం రూపొందించేందుకు దాదాపు ఐదు గంటక పాటు పురుషోత్తం శ్రమించాల్సి వచ్చింది.. సాల్ట్ ఆర్ట్ పై మక్కువతో హైదరాబాదులో ప్రత్యేక శిక్షణ పొందిన పురుషోత్తం సొంత ఊరు కుప్పంకు చేరుకుని తన ప్రతిభను కనబరుస్తూ, సాల్ట్ ఆర్ట్ పై స్ధానిక యువకులు నేర్పిస్తున్నాడు..

11:01 AM (IST)  •  09 Aug 2022

Vizianagaram జిల్లాలో మద్యం వ్యాను బోల్తా, పోటెత్తిన మందుబాబులు

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం వీపీ రేగ జంక్షన్ దగ్గరలో ప్రభుత్వ మద్యం తరలిస్తున్న వ్యాను అదుపు తప్పి బోల్తా పడింది. సగానికి పైగా మద్యం సీసాలు నేలపాలయ్యాయి. వ్యాన్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. కొంత మంది మద్యం ప్రియులు సంఘటనా స్థలానికి చేరుకొని దోచుకున్నారు. మద్యం వ్యాన్ బోల్తా పడడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari Joins Congress | కాంగ్రెస్ నేతలతో కడియం భేటీ..మరి పాతమాటల సంగతేంటీ.? | ABP DesamPrabhakar Chowdary Followers Angry | ప్రభాకర్ చౌదరికి టీడీపీ దక్కకపోవటంపై టీడీపీ నేతల ఫైర్ | ABPTDP Ex MLA Prabhakar Chowdary | అనంతపురం అర్బన్ టికెట్ దక్కకపోవటంపై ప్రభాకర్ చౌదరి ఆగ్రహం| ABP DesamNandamuri Balakrishna at Legend 10Years | పసుపు చీరలో సోనాల్ చౌహాన్..కవిత చెప్పిన బాలకృష్ణ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Embed widget