News
News
X

Breaking News Live Telugu Updates: మేడ్చల్ లో దారుణం, లారీ దూసుకెళ్లడంతో హోంగార్డు అక్కడికక్కడే మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
మేడ్చల్ లో దారుణం, లారీ దూసుకెళ్లడంతో హోంగార్డు అక్కడికక్కడే మృతి

మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే హోంగార్డు శ్రీనివాస్(35) అక్కడికక్కడే మృతి..

వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వేగంగా హోంగార్డు పైకి దూసుకెళ్లిన కంటైనర్ లారీ.. 

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పేట్ బషీరాబాద్ ఏసిపి రామలింగరాజు, మేడ్చల్ సి .ఐ రాజశేఖర్ రెడ్డి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాహన తనిఖీల్లో భాగంగా శ్రీనివాస్ కంటైనర్ లారీని ఆపే సమయంలో కంటైన డ్రైవర్ వేగంగా హోంగార్డు శ్రీనివాస్ని ఢీకొట్టారని చెప్పారు. లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు..

జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా, ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు

జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ మీడియా సమావేశం.

మీడియా ముందు కంటతడి పెట్టిన శ్రావణి 

చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన 

ప్రశ్నించడం తో నే ఎమ్మెల్యే అడుగడుగునా ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆరోపణలు 

ఎమ్మెల్యే వేధింపులుభరించలేక అని ఆవేదన

మీకు పిల్లలు ఉన్నారు.. వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అని భేదిరించారాని ఆరోపించిన శ్రావణి

డబ్బులు కోసం డిమాండ్ చేసారు. మేము ఇచ్చుకోలేం అని చెప్పాము.


దొర అహంకారం తో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక నాపై కక్ష గట్టారు.

అన్ని పనులకు అడ్డొస్తూ చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయవద్దని హుకుం జారీ చేసాడని ఆవేదన 

నరక ప్రాయంగా మున్సిపల్ చైర్మన్ పదవి.

నడి రోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యాను అని ఆవేదన వ్యక్తంచేశారు.

ఎన్ని అవమానాలు చేసినా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్ళాను అని...
ఎమ్మెల్యే తో పోలిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి చిన్నది అంటూ అవమానం వ్యక్తం చేశారు..
స్నేహితుడి కోసం జంక్షన్ చిన్నగా కట్టిన వ్యక్తి తను అని...
మూడు సంవత్సరాలనుండి నరకం అనుభవిస్తున్న అని బహిరంగం గానే రోదించారు.

చెప్పకుండా వార్డ్ సందర్శన చేసినా కూడా తప్పే ఇష్టం ఉన్నట్లు గా మాట్లాడి...
సమానంగా వర్క్ కేటాయించినా ఇబ్బందులకు గురి చేసారనీ...
ఒక్క పని కూడా తన చేతుల్తో ప్రారంభించకుండా చేసారనీ..
ట్రాలీలు కొంటె కక్ష పూరితంగా చెప్పకుండా కొన్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు చివరకు 
కలెక్టర్ ను కలవవద్దని ఆదేశం జారీ చేశారు అని అన్నారు.

మీ రేంజ్ ఎంత??? చిన్న ప్రోటోకాల్ పెట్టుకొని అధికారులను ఎలా కలుస్తారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసేవారని అన్నారు.
అనుకూలంగా ఉన్న కొద్దీ మంది కౌన్సిలర్లకు టార్చర్ చూపించేవరు అని..
అందరి ముందు అవమానించే వారు అని ఆరోపించారు.

Australian Open 2023: మిక్స్ డ్ డబుల్స్ లో ఫైనల్లోకి సానియా మీర్జా- రోహన్ బోపన్న 

Australian Open 2023:  ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో సానియా మీర్జా- రోహన్ బోపన్నల జోడీ ఫైనల్ లోకి దూసుకెళ్లింది. 

Tirumala News: శ్రీవారి సేవలో మాజీ గవర్నర్ నరసింహన్

తిరుమల శ్రీవారిని మాజీ గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

Tirupati Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం
 • తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం
 • తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిలో కల్ రోడ్డు వద్ద డివైడర్ ను ఢీకొన్న కారు
 • ఘటనలో నలుగురు దుర్మరణం, మరో ఐదు మందికి తీవ్ర గాయాలు
 • తిరుపతి నుంచి కాణిపాకం వెళ్తుండగా ఘటన
 • క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు
 • మహారాష్ట్రకు చెందిన వారీగా గుర్తించిన పోలీసులు
 • అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు
 • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం- నలుగురు మృతి

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతి నుంచి కాణిపాకం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కల్రోడ్‌పల్లిలో డివైడర్ ను కారు ఢీకొట్టింది. భక్తులు వెళ్తున్న వాహనం ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది.  క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. వీళ్లంతా మహారాష్ట్రకు చెందిన వారీగా గుర్తించారు పోలీసులు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్దారించారు. 

Nara Lokesh: యువగళం పాదయాత్రకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన నారా లోకేశ్
 • యువగళం పాదయాత్రకు హైదరాబాద్ లోని ఇంటి వద్ద నుండి బయలుదేరిన నారా లోకేష్
 • లోకేష్ కు దీవెనలు అందించిన తల్లిదండ్రులు
 • అభినందనలు తెలిపిన కుటుంబ సభ్యులు, బంధువులు
 • దగ్గర ఉండి కారు ఎక్కించిన మామ బాలకృష్ణ
 • మరికాసేపట్లో ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లనున్న నారా లోకేష్
 • ఎన్టీఆర్ కి నివాళులర్పించి కడప బయలుదేరనున్న లోకేష్
CH Malla Reddy: కంటివెలుగు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లాలోని డబిల్ పూర్, రైలాపూర్ గ్రామాల్లో మంత్రి చామకూర మల్లారెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. డబిల్ పూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే ఓ చరిత్ర అని మంత్రి  మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రతి వాడలో, ప్రతి ఊరిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. కంటి సమస్యలతో బాధపడే వృద్ధులకు కంటి వెలుగు కార్యక్రమం ఎంతగానో ఆసరా అవుతుందని మంత్రి మల్లారెడ్డి తెలియజేశారు.

YS Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఇప్పటికే అవినాష్ రెడ్డికి రెండ్రోజుల క్రితం సీబీఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ముందస్తుగా ఖరారైన కార్యక్రమాల కారణంగా తనకు నాలుగైదు రోజుల సమయం కావాలని ఆయన కోరారు. దీంతో తాజాగా సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది.

Dharmavaram News: పరిటాల రవి ఫ్లెక్సీలను చించేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ధర్మవరం పట్టణంలో పరిటాల రవి వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మంగళవారం అర్ధరాత్రి  గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.ఫ్లెక్సీల ధ్వంసం ఘటనను ఈ రోజు ఉదయం గమనించిన ధర్మవరం పట్టణ టీడీపీ నాయకులు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని రోడ్డుపై బైటాయించి ఫ్లెక్సీ లను ధ్వంసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో పట్టణ టీడీపీ నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం  జరిగింది. ఒకటో పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం ఘటన స్థలానికి చేరుకొని నిరసన చేస్తున్న వారితో చర్చలు జరిపి సంఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Nellore Kidnap Case: నెల్లూరు జిల్లా కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాలలోని ముగ్గురు మైనర్ బాలికల మిస్సింగ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసుని గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. సంక్రాంతి సెలవుల నుండి పాఠశాలకు వచ్చిన ఆ ముగ్గురు బాలికలు.. ఇంటిపై బెంగతో హాస్టల్ నుంచి బయటకు వచ్చేశారు. అప్పటికే చీకటి పడటం, ఇంటికి తిరిగి వెళ్తే తల్లిదండ్రులు మందలిస్తారన్న కారణంతో వారు వెంకటగిరిలో ఉండిపోయారు. ఆ ముగ్గురు 10వతరగతి చదువుతున్నారు. అయితే రాత్రికి పిల్లలు హాస్టల్ కి రాలేదని గ్రహించిన తల్లిదండ్రలు, హాస్టల్ సిబ్బంది పోలీసు లకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ సాయంతో ఆ పిల్లలను ట్రేస్ చేశారు. ఆ ముగ్గురు వెంకటగిరిలోని టీచర్స్ కాలనీలో ఉన్నట్టు గుర్తించారు. వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

Gannavaram News: గన్నవరం ఎయిర్‌పోర్టును కమ్మేసిన మంచు, విమానం గాల్లో చక్కర్లు
 • గన్నవరం ఎయిర్ పోర్టును కమ్మేసిన పొగ మంచు
 • పొగ మంచు కారణంగా గాలిలో చక్కర్లు కొడుతున్న విమానాలు
 • హైదరాబాద్ నుండి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం గాలిలో చక్కర్లు
 • సుమారు గంట నుంచి ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కలే చక్కర్లు కొడుతున్న ఎయిర్ ఇండియా విమానం
Background

జనవరి చివరి వారంలో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నెల 27న ఉపరితల ఆవర్తనంగా ఏర్పడి, 28న అల్ప పీడనంగా మారుతుందని తెలిపారు. అయితే, శ్రీలంకకు దక్షిణ భాగంలో ఇది ఏర్పడడం వల్ల ఆంధ్రా, తెలంగాణపై దీని ప్రభావం ఉండకపోవచ్చని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణ ప్రాంతంలో తూర్పు, ఆగ్నేయం దిశల నుంచి గాలులు వీస్తున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాతో పాటు యానాం ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో పొగమంచు అధికంగా ఏర్పడే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు మాత్రం పొగమంచు అంతగా ఉండదని వివరించారు. అంతా పొడి వాతావరణమే ఉంటుందని తెలిపారు. రేపు, ఎల్లుండి కూడా వాతావరణం పొడిగానే ఉంటుందని తెలిపారు.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎక్కువగా పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. రాయలసీమలోనూ ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఏపీ వ్యాప్తంగా సాధారణంగా చలి ఉంటుందని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల 13 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ఇటు విజయవాడలోనూ పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెదర్ బులెటిన్ లో తెలిపారు. నగరంలో పొగ మంచు కూడా ఏర్పడుతుందని తెలిపారు.

పశ్చిమ గాలుల ప్రభావం అంటే..
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘మనకు ఎలా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందో, అలాగే  హిమాలయాలు, మధ్య ఆసియా మీదుగా కూడ భూమిలోనే అల్పపీడనాలు ఏర్పడుతుంది. ఇది సాధారణంగా ఇరాన్, ఇరాక్ లో ఉన్న ఎడారిలో ఏర్పడి హిమాలాయాలు, ఉత్తర భారత దేశం వైపుగా వెళ్తుంది. దీనినే మనం వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటాము. అంటే చిన్నగా పశ్చిమ గాలులు అని అనవచ్చు. ఇది సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల వైపు ప్రభావం చూపదు. కానీ ఎప్పుడైనా బలంగా ఏర్పడినప్పుడు మాత్రం భాగా ప్రభావం చూపుతుంది’’ అని వివరించారు.

ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. రానున్న 5 రోజుల్లో ఢిల్లీతోపాటు పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయువ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలుల వల్ల ఆయా ప్రాంతాల్లో రెండు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వదులుగా, పొరలుపొరలుగా ఉండే దుస్తులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. త్వరలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అధికారి ఒకరు చెప్పారు.

తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. నేటి నుంచి వికారాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో చలి సాధారణంగానే ఉండనుంది. పశ్చిమ తెలంగాణ జిల్లాలైన కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో కాస్త పొగమంచు కూడా అధికంగా ఉంటుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 30 డిగ్రీలు, 18.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హైపోథర్మియాతో జాగ్రత్త
విపరీతమైన చలిలో బయటకు వెళ్లే వారు ఎవరైనా అల్ప ఉష్ణస్థితికి (హైపోథర్మియా) గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి పడిపోయే పరిస్థితినే హైపోథర్మియా అంటారు.

టాప్ స్టోరీస్

Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు

Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్‌ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!

Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్‌ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!

Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన

Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన