By : ABP Desam | Updated: 10 Dec 2022 10:59 AM (IST)
బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలం లోని కొప్పెరపాడు గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. బస్సులో ముందు కూర్చున్న ఒక వ్యక్తి క్యాబిన్లో ఇరుక్కుపోయి గంటసేపు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. ఇరుక్కుపోయిన వ్యక్తిని స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, 20 మందికి పైగా రక్త గాయాలయ్యాయి. క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం
తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి కావలి పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు.
* సత్యసాయి జిల్లా ఆమడగూరు మండలంలో విషాదం
* నాటు వైద్యం వికటించి ఇద్దరు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం
* మోకాళ్ళ నొప్పులకు మూడో తేదీన నాటు వైద్యుడిచే ఇంజక్షన్ చేయించుకున్న బాధితులు
* ఇంజక్షన్ చేసుకున్న మరుసటి రోజు నుంచే కాళ్ల వాపులతో తీవ్ర అస్వస్థతకు గురైన ఐదు మంది
* వీరిలో పొప్పూరమ్మ, రామప్పలు మృతి
* మరో ఇద్దరు బాధితులు బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రిలో చికిత్స
* ఇంకో బాధితుడు ఉత్తప్ప పులివెందులలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు
* వైద్యం వికటించి మృత్యువాత పడటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు
* వాయల్పాడుకు చెందిన నాటు వైద్యుడి కోసం ఆరా తీస్తున్న స్థానిక పోలీసులు
తిరుపతి లక్ష్మీపురం సర్కిల్, రామానుజ సర్కిల్, జైభీం నగర్ కాలనీలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పర్యటించారు. మోకాళ్ళ లోతు వర్షం నీటిలో ఇళ్లలో బాధితులను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పరామర్శించారు. 12వ డివిజన్ పరిధిలో వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కమిషనర్ అనుపమ అంజలి పర్యటించారు.
తుపానుపై సీఎం వైయస్.జగన్ సమీక్షించారు. అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుపాను పరిస్థితులపై సీఎం అధికారులతో సమీక్షించారు. వివిధ జిల్లాల్లో తుపాను ప్రభావంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు, భారీవర్షసూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ప్రత్యేకించి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన పక్షంలో పునరావాస శిబిరాలను తెరిచి.. వారికి అన్నిరకాలుగా అండగా ఉండాలని ఆదేశించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండస్ గత అర్ధరాత్రి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటినట్లుగా వాతావరణ అధికారులు తెలిపారు. ఇది శుక్రవారం ఉదయానికే తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడినట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా ఇది వాయవ్య దిశగా పయనించి శనివారం (డిసెంబరు 10) ఉదయానికి మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు తెలిపారు.
తుపాన్ ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పలుచోట్ల పది మీటర్ల నుంచి 20 మీటర్ల దూరం మేర సముద్రం ముందుకు వచ్చింది. ఏపీలో వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. చలిగాలులు ప్రజల్ని బాగా ఇబ్బంది పెట్టించాయి. తీరం వెంట 65 నుంచి 75 కిలో మీటర్ల వేగంతో వేగంతో గాలులు వీస్తుండగా.. కోస్తా, రాయలసీమ కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. అత్యధికంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో 125.75, తిరుపతి జిల్లా నాయుడుపేటలో 114 మి.మీ వర్షపాతం నమోదైంది.
‘‘తిరుపతి జిల్లాలోని పలు భాగాల్లో విపరీతమైన వర్షాలు వర్షాలు కురుస్తున్నాయి. గాలులు గంటకు 70 కిలో మీటర్ల వేగంతో వీచాయి. అలాగే నెల్లూరు, పక్కనే ఉన్న అన్నమయ్య జిల్లాల్లో వర్షాలుంటాయి. చిత్తూరు జిల్లాలో కూడా వర్షాలు జోరందుకోనున్నాయి. తుపాను నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలతో పాటుగా విశాఖ నగరంలో కూడా తెలికపాటి వర్షాలు పడ్డాయి. తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడ్డాయి. అలాగే ఈ వర్షాలు మెల్లగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఈ తుపాను మామూలు విధ్వంసకరాన్ని తేవడంలేదు.
అర్ధరాత్రి సమయంలో మాండోస్ తుపాను చెన్నైకి సమీపాన తీరాన్ని తాకడం ప్రారంభించింది. ఇక్కడ నుంచి అసలైన తుపాను ప్రభావం మన రాష్ట్రం మీదుగా పడనుంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలి. తిరుపతి జిల్లాలో విస్తారంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా తిరుపతి జిల్లా నాయుడూపేటలో 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. తిరుపతి నగరంలో వర్షాల జోరు గంట గంటకు పెరుగుతోంది, ఇంకా పెరగనుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ రాశారు.
ఈ జిల్లాల్లో వర్షాలు భారీ వర్షాలు
‘‘తుపాను ప్రభావంతో ఈ రోజు (డిసెంబరు 10) ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి. చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తుపాను తీరం దాటినప్పటికి రేపటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
తుపాను ప్రభావం తెలంగాణపై చాలా స్వల్పంగా ఉంది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్‌లో వాతావరణం ముసురు పట్టి ఉంటుంది. నగరంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 16 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు దిశ నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు.
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!