అన్వేషించండి

Breaking News: చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

LIVE

Key Events
Breaking News: చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు

Background

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. నందలూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని తెలుసుకోనున్నారు. సోము వీర్రాజుతో పాటు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి,  కిసాన్ మోర్చా ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సురేష్ రెడ్డి మరియు బిజేపి రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు... వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పుట్టపర్తికి చేరుకున్నారు. సోమవారం సత్యసాయి విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవంలో సీజేఐ పాల్గొననున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు అధికారులు, రాజకీయ ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. సీజేఐ పర్యటన సందర్భంగా పుట్టపర్తిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు దాదాపు ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ దిల్లీ పర్యటనకు వెళ్లే ముందు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పలువురు అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చినట్లు తెలిసింది. నేడు అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ అధిష్ఠానం అధికారకంగా ప్రకటించనున్నారు. నేడు, రేపు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్సీలకు చోటుదక్కలేదు. కల్వకుంట్ల కవితకు రాజ్యసభ సీటు కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

దక్షిణ అండమాన్ దాని పరిసర ప్రాంతాల మీద ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దక్షిణ అంతర్గత కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. వీటి ప్రభాతంలో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేశారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. రేపటి నుంచి రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురవనున్నాయి. 

తెలంగాణలో వాతావరణం ఇలా..
తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. కానీ మరో మూడు నుంచి నాలుగు రోజులపాటు తెలంగాణలో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు. వాతావరణంలో పెద్దగా మార్పులేమీ ఉండవని, అంతా చల్లగా ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. నేడు సైతం హైదరాబాద్‌లో చిరు జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.

18:10 PM (IST)  •  22 Nov 2021

చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు

చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు వచ్చాయి. పూతలపట్టు మండలం తుంబవారిపల్లెలో భూమి కంపించడంతో స్థానికులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామానికి బయలుదేరారు.  వారం క్రితం ముదిగుబ్బలో భూప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. 

17:37 PM (IST)  •  22 Nov 2021

మానేరు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన బండి సంజయ్

సిరిసిల్ల పట్టణంలో ఇటీవల మానేరు నదిలో పడి మృతిచెందిన ఆరుగురు విద్యార్థుల కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. ఒక్కొక్కరికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతకు ముందు ప్రమాదం జరిగిన ప్రాంతానికి స్థానిక బీజేపీ నేతలతో కలిసి వెళ్లి పరిశీలించారు. అక్కడ ఇసుక కారణంగా ఏర్పడిన గుంతలు ప్రమాదానికి కారణమని స్థానిక నేతలు బండి సంజయ్ కి వివరించారు

 

15:26 PM (IST)  •  22 Nov 2021

మళ్లీ మూడు రాజధానుల బిల్లులు ప్రవేశపెడతాం : సీఎం జగన్

రాజధాని అంశంపై సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. మళ్లీ పూర్తి సమగ్ర బిల్లుతో సభ ముందుకు వస్తామని తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుపై ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.."ఒకప్పుడు కర్నూలు రాజధానికిగా ఉండేది. 1956లో కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్ కు తరలిపోయింది. నా ఇల్లు అమరావతిలోనే ఉంది. నాకు ఈ ప్రాంతం అంటే ప్రేమ ఉంది. కనీసం రోడ్లేసుకోవడానికి, కరెంట్ ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితి. చదువుకున్న మన పిల్లలు ఉద్యోగాల కోసం బెంగుళూరు, చెన్నై వెళ్లాల్సిందేనా..?. విశాఖలో ఇప్పటికే రోడ్లు, డ్రైనేజ్ లు , కరెంట్ ఉన్నాయి. విశాఖ మరో ఐదు, పదేళ్లలో హైదరాబాద్ వంటి నగరాలకు పోటీ పడే అవకాశం ఉంది. గత రెండేళ్ల నుంచి రాజధాని విషయంలో రకరకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వికేంద్రీకరణ బిల్లు అమల్లోకి వస్తే ఈ పాటికే మంచి ఫలితాలు అమల్లోకి వచ్చేవి.' అన్నారు. 

హైదరాబాద్ వంటి సూపర్ క్యాపిటల్ వద్దే వద్దని ప్రజలు తెలిపారని సీఎం జగన్ తెలిపారు. అందుకే వికేంద్రీకరణ బిల్లుకు తీసుకోచ్చామని సీఎం జగన్ తెలిపారు. వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనుమానాలు, కోర్టు కేసులు వచ్చాయన్నారు. కొందరికి అన్యాయం జరుగుతుందనే వాదన ముందుకు తెచ్చారన్నారు. ప్రభుత్వ సదుద్దేశ్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, మళ్లీ పూర్తి సమగ్ర బిల్లుతో సభ ముందుకు తీసుకోస్తామని తెలిపారు. విస్తృత, విశాల అభిప్రాయాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

11:39 AM (IST)  •  22 Nov 2021

మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న ఏపీ సర్కార్..!

మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. కాసేపట్లో సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉంది.  నేడు ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల అంశంపై కీలక చర్చ జరగనుంది. సీఆర్డీఏ రద్దు బిల్లును ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. 

10:48 AM (IST)  •  22 Nov 2021

విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. లోపల 20 మంది

వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ సమీపంలో విద్యార్థులతో వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 8 మంది స్టూడెంట్స్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను స్థానికులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో మొత్తం 20 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులంతా ముజాహిద్‌పూర్ మోడల్ స్కూలుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Divorce Proceedings in India : డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
Telangana Tourism: సీఎం రేవంత్‌ చెప్పారు- నాగార్జున చేశారు- తెలంగాణలో కింగ్‌కు నచ్చిన ఫుడ్‌ ఇదేనట!
సీఎం రేవంత్‌ చెప్పారు- నాగార్జున చేశారు- తెలంగాణలో కింగ్‌కు నచ్చిన ఫుడ్‌ ఇదేనట!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Divorce Proceedings in India : డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
Telangana Tourism: సీఎం రేవంత్‌ చెప్పారు- నాగార్జున చేశారు- తెలంగాణలో కింగ్‌కు నచ్చిన ఫుడ్‌ ఇదేనట!
సీఎం రేవంత్‌ చెప్పారు- నాగార్జున చేశారు- తెలంగాణలో కింగ్‌కు నచ్చిన ఫుడ్‌ ఇదేనట!
OG Sriya Reddy: పవన్ కళ్యాణ్  OG బ్యూటీ శ్రియా రెడ్డి షాకింగ్ లుక్!
పవన్ కళ్యాణ్ OG బ్యూటీ శ్రియా రెడ్డి షాకింగ్ లుక్!
Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Embed widget