అన్వేషించండి

Out Sourcing Employees: సజ్జల కాళ్లపై పడ్డ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని, పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి

తమకు న్యాయం చేయాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని సజ్జల కాళ్లపై పడ్డారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాన్ని పెంచాలని, పీఆర్సీ అమలు చేయాలని వేడుకున్నారు.

తమ సమస్యల్ని పరిష్కరించాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కాళ్లపై పడ్డారు. ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీతో చర్చల కోసం సజ్జల సచివాలయానికి వచ్చారు. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకు కూడా పీఆర్సీ అమలు చేయాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సజ్జలను వేడుకున్నారు. కనీస వేతనాన్ని రూ.15 వేల నుంచి రూ.26 వేలకు పెంచాలని ఉద్యోగులు కోరారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను కార్పొరేషన్‌లో చేర్చామని అని సజ్జల అన్నారు. దాంతో ఒకటో తేదీన జీతం తప్ప ఎలాంటి న్యాయం జరగలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సజ్జలను విజ్ఞప్తి చేశారు. సెక్రటేరియట్‌లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఆయన ఆరా తీశారు. తమకు న్యాయం చేయాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని సజ్జల కళ్లపై పడ్డారు. 

పీఆర్సీ జీతాలు అందించాలని విజ్ఞప్తి

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకొన్నారు. ఉద్యోగుల్లో కొంతమంది సజ్జల కాళ్లపై పడి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వేడుకున్నారు. పీఆర్సీ ప్రకారం తమకూ వేతనాలు పెంచాలని సజ్జలకు వినతిపత్రం అందించారు. ప్రస్తుత జీతాలతో తమ జీవనం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ప్రభుత్వం ఉద్యోగులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కొత్త పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెబాట పట్టబోతున్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా వారిని నిలువరించేందుకు ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. మంత్రుల కమిటీతో ఉద్యోగులు చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

జీతాల పెంపు ప్రతిపాదనలు

ఏపీలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచుతూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సీనియర్ కేటగిరీలో అసిస్టెంట్, స్టెనో, అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్ తదితరులకు రూ.17,500 నుంచి రూ.21,500కు జీతం పెంచింది. మరోవైపు జూనియర్ విభాగంలో అసిస్టెంట్, స్టెనో, డ్రైవర్, టైపిస్ట్, మెకానిక్, ఫిట్టర్ తదితరులకు జీతాన్ని రూ.15 వేల నుంచి రూ.18,500కి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. వీరితో పాటు సబార్డినేట్, వాచ్‌మెన్, కుక్, చౌకీదార్ తదితరుల జీతాన్ని రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతున్నట్లు పేర్కొంది. కాగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెరిగిన జీతాలు జనవరి నెల నుంచి అమలు కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Akshaye Khanna Dhurandhar : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
Car Skidding: వర్షంలో అకస్మాత్తుగా కారు అదుపు తప్పిందా? అది ఆక్వాప్లానింగ్‌! - ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి
తడిరోడ్డుపై కారు అకస్మాత్తుగా స్కిడ్‌ కావడానికి కారణం ఇదే! - డ్రైవర్లు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Embed widget