అన్వేషించండి

Andhra News : రోడ్లేస్తే బతుకులు బాగుపడతాయా ? - వైరల్ అవుతున్న ఏపీ మంత్రి కామెంట్స్

AP Minister Dharmana : రోడ్లు వేస్తే జీవితాలు బాగుపడతాయా అని ఏపీ మంత్రి ధర్మాన ప్రశ్నించారు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

Andhra News :   ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రోడ్ల నిర్మాణం పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  రోడ్లు బాగోలేవని వచ్చే ఎన్నికల్లో వైసీపీని వద్దనుకోవద్దని ఆయన ఓ మీటింగ్ లో ఓటర్లను కోరారు.  రోడ్ల వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయా? అని ఆయన ప్రశ్నించారు. చెన్నై, కర్నూలు రాష్ట్ర రాజధానులుగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు అక్కడకు వెళ్లడానికి రెండు రోజులు పట్టేదని చెప్పారు. విశాఖ కంటే గొప్ప అర్హతలు ఉన్న రాజధాని ఏపీలో లేదని అన్నారు. విశాఖ రాజధాని వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో విద్యుత్తు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని… మన కంటే ధరలు తక్కువ ఉన్న రాష్ట్రం ఏదో చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన ఉపయోగం లేని పనులు ఏమిటో టీడీపీ నేతలు చెప్పలేకపోతున్నారన్నారు.  


రోడ్లపై ధర్మాన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సెటైర్లు వేసింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో కిలోమీటర్ రోడ్డు కూడా ఎందుకు వేయలేదా అనుకున్నాం. ఈ తెలివితేటలే కారణం అన్నమాట! చరిత్రలో రోడ్లు వేసిన పాలకులంతా పిచ్చోళ్ళన్నట్టేనా మంత్రి ధర్మాన ప్రసాదరావు గారూ? ఇక రోడ్లు వేయడానికి ఒక మంత్రిత్వ శాఖ, దానికో మంత్రి కూడా అక్కర్లేదన్న మాట అని కౌంటర్ ఇచ్చింది.  

 

రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు బాగుంటేనే అభివృద్ధి జరుగుతుందని ఎవరైనా చెబుతారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల్లో అత్యంత ముఖ్యమైనది రోడ్లు. కానీ ఏపీ మంత్రి అసలు రోడ్ల వల్ల ఉపయోగమే లేదని చెబుతున్నారు. ఏపీలో గత నాలుగున్నరేళ్ల కాలంలో కొత్తగా రోడ్లు నిర్మించలేదని .. నిర్వహణ చేపట్టకపోవడం వల్ల రోడ్లన్నీ గుంతలు తేలిపోయాయన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభత్వం మాత్రం రోడ్లు బాగున్నాయని గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తున్నామని  చెబుతోంది. కానీ మంత్రులు మాత్రం రోడ్ల వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.                

మరో మంత్రి కొడాలి నాని కూడా రోడ్ల పరిస్థితిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క పథకం ఆపినా రాష్ట్రంలో రహదారులు వేయడం పెద్ద కష్టమేమీ కాదని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు వేయాలంటే రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు సరిపోతాయన్నారు. దీనికి డ్వాక్రా మహిళలకు ఇచ్చే ఒక్క విడత లబ్ధిని ఆపినా చాలన్నారు. రోడ్లపై ఉన్న చిన్నచిన్న గుంతల వద్ద చేరి తెదేపా, జనసేన నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.         

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Latest News: చంద్ర‌బాబుకే గుర్తింపు లేదంటే ఇక మా ప‌రిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది! 
చంద్ర‌బాబుకే గుర్తింపు లేదంటే ఇక మా ప‌రిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది! 
Konaseema Latest News: కోన‌సీమలో కాశ్మీర్ అందాలు! వేసవిలోనూ వీడని మంచు దుప్పటి!
కోన‌సీమలో కాశ్మీర్ అందాలు! వేసవిలోనూ వీడని మంచు దుప్పటి!
Iran War Effect On Coconut Market: కోనసీమ కొబ్బరికి యుద్ధ‌ గండం! పోర్టుల్లో నిలిచిపోయిన కంటెయినర్లు! బోరుమంటున్న వ్యాపారులు! 
కోనసీమ కొబ్బరికి యుద్ధ‌ గండం! పోర్టుల్లో నిలిచిపోయిన కంటెయినర్లు! బోరుమంటున్న వ్యాపారులు! 
YSRCP coterie problem: వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?
వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Musi Riverfront Development Project:మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
Pithapuram Latest News: చంద్ర‌బాబుకే గుర్తింపు లేదంటే ఇక మా ప‌రిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది! 
చంద్ర‌బాబుకే గుర్తింపు లేదంటే ఇక మా ప‌రిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది! 
Pathala Bhairavi: పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
Trisha: ఎయిర్ పోర్టులో త్రిష... మీడియా ప్రశ్నల వర్షం - సౌత్ క్వీన్ ఏం చెప్పారంటే?
ఎయిర్ పోర్టులో త్రిష... మీడియా ప్రశ్నల వర్షం - సౌత్ క్వీన్ ఏం చెప్పారంటే?
Amavasya 2026: మార్చి 19 భూతడి అమావాస్య రోజు ప్రతికూల శక్తుల ఆధిపత్యం! పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
మార్చి 19 భూతడి అమావాస్య రోజు ప్రతికూల శక్తుల ఆధిపత్యం! పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
Bangaru Bomma Song Lyrics: బంగారు బొమ్మ లిరిక్స్... ఎస్పీబీని గుర్తు చేసిన చరణ్ - సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాలో సాంగ్ విన్నారా?
బంగారు బొమ్మ లిరిక్స్... ఎస్పీబీని గుర్తు చేసిన చరణ్ - సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాలో సాంగ్ విన్నారా?
YSRCP coterie problem: వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?
వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?
LPG గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఎర్రగా ఉంటాయి? జ్యోతిష్య శాస్త్రంతో వాటికి సంబంధం ఏంటి?
LPG గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఎర్రగా ఉంటాయి? జ్యోతిష్య శాస్త్రంతో వాటికి సంబంధం ఏంటి?
Embed widget