Minister Botsa Satyanarayana: మంత్రివర్గం మార్పు సీఎం ఇష్టం... పవన్ నోరుందని ఇష్టానుసారంగా మాట్లాడకు.... ఏపీ మంత్రి బొత్స హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన మంత్రివర్గం మార్పు, పవన్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆయన ఏమన్నారంటే...
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గం ఏర్పాటుపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈసారి కొత్త వాళ్లకు మంత్రివర్గంలో చోటు ఉంటుందన్న మంత్రి బాలినేని వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. తాజాగా మంత్రివర్గం మార్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మంత్రివర్గం మార్పు ముఖ్యమంత్రి పరిధిలోని అంశం అన్నారు. విజయనగరం జిల్లా పైడితల్లి సిరిమానోత్సవం వేడుకలపై బొత్స అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, సంప్రదాయకంగా వేడుకలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read: ‘జగన్ గురించి మాట్లాడితే తాటతీస్తాం, పనికిమాలిన స్టార్..’ పవన్‌పై వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు
పైడితల్లి సిరిమానోత్సవంపై
మంత్రివర్గంపై ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛ ఉందని మంత్రి బొత్స అన్నారు. ఆయన నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటామని పేర్కొ్న్నారు. మంత్రివర్గ విస్తరణ అనేది సీఎం ఇష్టమని స్పష్టంచేశారు. పైడితల్లి సిరిమానోత్సవ వేడుకలపై సమీక్షించిన ఆయన అనవాయితీగా దసరా తర్వాత వచ్చే మంగళవారం సిరిమానోత్సవం నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స తెలిపారు. ఈ ఉత్సవానికి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్ మూడో వేవ్‌పై డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు చేసినందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని బొత్స సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సంప్రదాయకంగా వేడుకలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: త్వరలో ఏపీ మంత్రివర్గంలో భారీ మార్పులు.. మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు
పవన్ వ్యాఖ్యలపై
ఆన్లైన్ సినిమా టికెట్ల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. నోరుందని పవన్ కల్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడతారా అని మంత్రి బొత్స నిలదీశారు. సినిమా టికెట్ల ఆన్‌లైన్ విధానాన్ని డిస్ట్రిబ్యూటర్లు అడిగారన్నారు. ఈ విధానంపై ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. పరిశ్రమ పెద్దలే ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చన్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల విషయంలో నియంత్రణ లేదని బొత్స అన్నారు. ప్రజలపై భారం వేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలని అని ప్రశ్నించారు.
Also Watch: ఎంపీపీ పీఠాల కోసం నగరిలో రోడ్డున పడ్డ వైసీపీ రాజకీయం..!