అన్వేషించండి

AP IAS Transfers: ఏపీలో భారీగా IASల బదిలీ, ఏకంగా 62 మందికి పోస్టింగ్- కృష్ణతేజకు ఏ పోస్ట్ ఇచ్చారంటే!

IAS transfer in Andhra Pradesh | ఏపీ ప్రభుత్వం ఐఏఎస్‌లను భారీ సంఖ్యలో బదిలీ చేసింది. ఐఏఎస్‌ల బదిలీపై ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ శనివారం (జులై 20న) నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

62 IAS officers transferred in AP | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఏకంగా 62 మంది ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐఏఎస్‌ల బదిలీపై శనివారం రాత్రి ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కేరళ కేడర్ నుంచి ఏపీకి చెందిన యువ ఐఏఎస్ ఎం కృష్ణతేజను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ రిక్వెస్ట్ తో డిప్యూటేషన్ మీద సొంత రాష్ట్రానికి రప్పించారు. ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ కృష్ణతేజకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌‌గా నియమించింది.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్‌గా ఎం.వి.శేషగిరి, హ్యాండ్‌లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌శాఖ కమిషనర్‌గా రేఖారాణి, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌ నియమితులయ్యారు. మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌గా సీహెచ్‌. శ్రీదత్‌ను నియమించిన ప్రభుత్వం, ఆయనకు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.

ఐఏఎస్ అధికారులు - పోస్టింగ్స్

- ఎంవీ శేషగిరి బాబు - స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్‌
- సీహెచ్‌ శ్రీదత్‌ - మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌ (మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అడిషనల్ డ్యూటీ) 
- రేఖారాణి - హ్యాండ్‌లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌శాఖ కమిషనర్‌ 
- చేవూరి హరికిరణ్‌  - ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ 
- మల్లికార్జున - బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ (బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా అడిషనల్ డ్యూటీ)
- శ్రీకేష్‌ బాలాజీరావు - ల్యాండ్ సర్వే, సెటిల్‌మెంట్లు డైరెక్టర్‌
- ప్రసన్న వెంకటేశ్‌ - సాంఘిక, సంక్షేమశాఖల కార్యదర్శి
- జి.సి కిషోర్‌ కుమార్‌ - క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్‌ మిషన్‌ ఎండీ
- గిరీశ్‌ షా - పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఎండీ
- కీర్తి చేకూరి - ట్రాన్స్‌ కో జాయింట్‌ ఎండీ 
- ఎం.వేణుగోపాల్‌రెడ్డి - మహిళ, శిశుసంక్షేమశాఖ డైరెక్టర్‌
- నారపురెడ్డి మౌర్య - తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ 
- నిషాంత్‌ కుమార్‌ - ఎక్సైజ్‌ శాఖ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌
- దినేష్‌ కుమార్‌ - గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌
- విజయ సునీత - వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌
- రామసుందర్‌రెడ్డి - ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌
- తేజ్‌ భరత్‌  -  కడప మున్సిపల్‌ కమిషనర్‌
- సంపత్‌ కుమార్‌ - విశాఖ మున్సిపల్‌ కమిషనర్‌
- ధ్యానచంద్ర - విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌
- కేతన్‌ గార్గ్‌ -  రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌
- అమిలినేని భార్గవతేజ - గుంటూరు జిల్లా జేసీ
- హిమాన్షు కోహ్లీ -  తూర్పుగోదావరి జేసీ
- నిశాంతి  - కోనసీమ జిల్లా జేసీ
- సూరజ్‌ ధనుంజయ్‌ - పల్నాడు జేసీ
- గోవిందరావు  - కాకినాడ జేసీ   
- వీరపాండ్యన్‌ - సెర్ప్‌ సీఈవో
- రవి సుభాష్‌ - ఎస్పీపీడీసీఎల్‌ సీఎండీ
- కృతికా శుక్లా - ఇంటర్‌ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌
- లక్ష్మీ షా - ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఎండీ (ఎన్టీఆర్‌ వైద్యసేవ CEOగా అడిషనల్ డ్యూటీ)
- మంజీర్‌ జిలానీ - ఏపీ మార్క్‌ఫెడ్‌ ఎండీ (శాప్‌ ఎండీగా అడిషనల్ డ్యూటీ)
- ఎం కృష్ణతేజ - పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌
- సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌, నవీన్‌ - సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్లు
- ఎం. హరినారాయణ - మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌
- ఆదర్శ్‌ రాజేంద్రన్‌ - అన్నమయ్య జిల్లా జేసీ
- ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ - శ్రీకాకుళం జేసీ
- పి ధాత్రిరెడ్డి - ఏలూరు జేసీ
- అభిషేక్‌ గౌడ - అల్లూరి జిల్లా జేసీ
- అదితి సింగ్‌ - కడప జేసీ
- నూరుల్‌ కమల్‌ - ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ
- నిది మీనా - ఎన్టీఆర్‌ జిల్లా జేసీ
- విష్ణు చరణ్‌ - నంద్యాల జేసీ
- శుభం భన్సాల్‌ - తిరుపతి జేసీ

Also Read: ఏపీలో ఆదివారం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, IMD అలర్ట్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Embed widget