AP High Court: ఎన్నికల సంఘానికి ఏపీ హైకోర్టు నోటీసులు, రెండు వారాలు గడువు
కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, కృష్ణా జిల్లా కలెక్టర్, ఆర్డీవోకి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఏపీ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. ఓటర్ లిస్టు తయారీలో పారదర్శకత కొరవడుతోందని, చాలా తప్పిదాలు ఉంటున్నాయని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. కొన్ని చోట్ల ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు వ్యక్తులకు వేర్వేరు చోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు కల్పించారని పిటిషన్ తాను దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 2 కిలో మీటర్ల లోపల ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు కల్పించాల్సి ఉంది. కానీ, అందుకు విరుద్ధంగా దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రంలో కూడా ఓటు హక్కు కల్పిస్తు్న్నారని పిటిషనర్ వాదించారు. ఈ విషయాలపై తమ అభ్యంతరాలను గతంలో తెలిపినా కూడా పట్టించుకోకుండా ఫైనల్ లిస్ట్ ప్రకటించారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
అయితే, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, కృష్ణా జిల్లా కలెక్టర్, ఆర్డీవోకి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.. ఇక, తర్వాతి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.





















