అన్వేషించండి

Amaravati : ఆర్-5 జోన్‍లో ఇళ్ల నిర్మాణంపై తీర్పు రిజర్వ్ - శంకుస్థాపనకు జోరుగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం !

ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టులో తీర్పు రిజర్వ్ అయింది. 24న శంకస్థాపనలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.


Amaravati :  ఆర్-5 జోన్‍లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టులో రైతలు, ప్రభుత్వం తరపున  వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.  ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు లాయర్లు.. పట్టాల పంపిణీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని ఈ సందర్భంగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, ఆర్-5 జోన్‍లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఉందా? అంటూ ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది.  తాము ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామంటూ పిటిషన్‍లోనే పేర్కొన్నామన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు హైకోర్టు వివరించారు.. ఇళ్ల నిర్మాణంపై తుది తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ప్రజాధనం వృధా అవుతుంది కదా? అని వ్యాఖ్యానించింది హైకోర్టు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్‌-5 జోన్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై దాఖలైన రిట్‌ పిటిషన్లపై ఈ నెల 17న విచారణ చేపట్టింది ఏపీ హైకోర్టు.. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు యు.దుర్గాప్రసాద్, వి.జ్యోతిర్మయిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.. అనంతరం తదుపరి విచారణ చేపట్టేందుకు కేసును ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది.

గత విచారణలో రైతుల తరపున లాయర్‌ ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. భూమి బదలాయింపు సీఆర్డీయే కు పూర్తిగా జరగలేదన్నారు. అనుబంధ ఒప్పందంలో ఎవరికి ఏ భూమి అనేది ఇంకా తేలలేదని, రైతులకు ఇచ్చిన ప్లాట్లలో పూర్తిస్థాయి సదుపాయాలు కల్పిస్తేనే.. ఒప్పందం పూర్తవుతుందని లాయర్‌ మురళీధర్ కోర్టుకు తెలిపారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎక్కడా అమలు చేయలేదని.. దీనివల్లే భూమిపై సీఆర్డీయేకు హక్కులు లేవని లాయర్‌ మురళీధర్ హైకోర్టుకు తెలిపారు..సుప్రీం కోర్టు ఇప్పటికే ప్లాట్లు పంపిణీ చేయవచ్చని చెప్పింది కదా? అని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు  ప్లాట్‌లు పంపిణీ చేయమని చెప్పింది కానీ.. గృహనిర్మాణం చేయాలని చెప్పలేదని లాయర్‌ మురళీధర్ సమాధానం ఇచ్చారు. తుది తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే.. ఇళ్లపై పెట్టిన రూ.2 వేల కోట్లు దుర్వినియోగమైనట్టే కదా అని వాదనలు వినిపించారు. ఈ నెల 24న ఇళ్లకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని మురళీధర్ కోర్టుకు తెలిపారు. ఆరోజు ఏం జరుగుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ రోజు నుంచే పనులు ప్రారంభమవుతాయని న్యాయవాదులు చెప్పారు.  

మరో వైపు   అమరావతి ఆర్‌-5 జోన్‌ పరిధిలో గృహనిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాల కారణంగా లేఅవుట్లలో నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ప్లాట్ల మంజూరు చేసేనాటికే మెరక, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టారు.  ఈ జోన్‌లో గృహ నిర్మాణానికి ఈనెల 24వ తేదీన సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి లాంఛనంగా భూమిపూజ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ పర్యవేక్షిస్తున్నారు.

 కొద్ది నెలల క్రితం ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాలలోని 53,216 మంది పేదలకు ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయటంతో పాటు స్థిర నివాసాలు ఏర్పాటు చేసేందుకు వీలుగా సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు  రూ.72.06 కోట్లతో సోషల్‌ ఇన్ఫా ప్రాజెక్టులకు 25 లేఅవుట్ల చెంత నైబర్హుడ్‌ స్కూల్స్‌, ఈ హెల్త్‌ సెంటర్లు, అంగన్‌ వాడీ సెంటర్లు, డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 25 లే అవుట్లలో ఏఎస్‌ఎస్సీసీఎల్‌ 45 ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలు ఇలా ఉన్నాయి. నైబర్‌ హుడ్‌ స్కూల్స్‌ రూ. 25 కోట్ల అంచనా వ్యయంతో 11 ఏర్పాటు కానున్నాయి.  12 ఈ-హెల్త్‌ సెంటర్లను రూ.20 కోట్లతో చేపట్టనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget