అన్వేషించండి

AP Highcourt CID : చింతకాయల విజయ్ ఇంట్లో సోదాలపై పిటిషన్ - డీజీపీ, సీఐడీ ఏడీజీలకు హైకోర్టు నోటీసులు

ఏపీ డీజీపీ, సీఐడీ ఏడీజీలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సెర్చ్ వారెంట్ లేకుండా చింతకాయల విజయ్ ఇంట్లో సోదాలు చేయడంపై పిటిషన్ దాఖలయింది.

AP Highcourt CID :  తెలుగుదేశం పార్టీ నేత చింతకాయల విజయ్ కు చెందిన హైదరాబాద్ నివాసంలో ఏపీసీఐడీ అధికారులు సోదాలు చేయడం, ఆయన పిల్లలను ప్రశ్నించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. చింతకాయల విజయ్ భార్య సువర్ణ రిట్ పిటిషన్ దాఖలు చేశారు సీఐడీ  పోలీసులు ఎలాంటి  సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారని.. అన్ని గదుల్లోనూ సోదాలు జరిపారన్నారు. చివరికి చిన్న పిల్లలను కూడా వదిలి పెట్టలేదని భయపెట్టేలా ప్రశ్నించారన్నారు. ఇదంతా చట్ట నిబంధనలను ఉల్లంఘించడమేనని.. సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని సువర్ణ పటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు  డీజీపీ, ఏడీజీ, సీఐ పెద్దిరాజులకు నోటీసులు జారీ చేసింది.  రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 

చింతకాయల విజయ్ ఇంట్లో సీఐడీ పోలీసుల సోదాలు

అక్టోబర్ ఒకటో తేదీన హైదరాబాద్‌లోని చింతకాయల విజయ్ ఇంటికి  ఏపీసీఐడీ  పోలీసులు పది మంది వరకూ వచ్చారు. ఆ సమయంలో చింతకాయల విజయ్ ఇంట్లో లేరు. పనిమనిషులతో పాటు చిన్న పిల్లలు ఉన్నారు. అయితే వారినే సీఐడీ అధికారులు ప్రశ్నించారని.. ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారన్న ఆరోపణలు వచ్చాయి. చింతకాయల విజయ్ పిల్లలను ప్రశ్నించి వారి ఫోటోలు తీసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.  అయితే సీఐడీ పోలీసులు ఎలాంటి అలజడి సృష్టించలేదని..  ఓ కేసులో నోటీసులు ఇవ్వడానికి వెళ్లారని సీఐడీ తెలిపింది.   విజయ్‌ ఇంట్లో లేకపోవడంతో నోటీసులు ఇచ్చామన్నారు.  

ఐ టీడీపీ పెట్టిన పోస్టుల కారణంగా కేసులు

సీఎం జగన్ సతీమణి భారతిని కించపరిచేలా భారతీపే పేరుతో పోస్టర్లు వేశారని.. ఐ టీడీపీ పేరుతో వాటిని సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేశారని ... కేసు పెట్టారు. అయితే ఐ టీడీపీ అనేది సంస్థ కాదని.. తనను కేసు నుంచి తప్పించాలని విజయ్ హైకర్టును ఆశ్రయించారు. అయితే నిబంధనల ప్రకారం విచారణ కొనసాగించాలని సీఐడీకి హైకోర్టు తెలిపింది. కేసును కొట్టి వేయడానికి నిరాకరించంది. మరో వైపు ఈ కేసులో విజయ్ నోటీసులు ఇచ్చిన ప్రకారం హాజరు కాకపోవడంతో  ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని సీఐడీ అధికారులు  గుంటూరు కోర్టును సీఐడీ అధికారులు ఆశ్రయించారు.  కేసు విషయంలో నోటీసులు ఇవ్వడానికి వెళ్తే.. తమను చింతకాయ విజయ్ అనుచరులు అడ్డుకున్నారని తెలిపారు. విచారణకు హాజరు కాలేదని దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సీఐడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

సీఐడీ పోలీసు తీరుపై టీడీపీ నేతల తీవ్ర విమర్శలు

సీఐడీ  పోలీసులు నోటీసులు ఇవ్వకుండా.. ఇలా వరుసగా టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో పలువుర్ని అంతే అరెస్ట్ చేశారు. చింతకాయల విజయ్ ను కూడా అలాగే అరెస్ట్ చేయడానికి రెండు, మూడు వాహనాలతో వచ్చారని కానీ ఆయన ఇంట్లో లేకపోడంతో నోటీసులు ఇచ్చారని టీడీపీ నేతలంటున్నారు. ఈ వ్యవహారంపై నేరుగా డీజీపీ, సీఐడీ ఏడీజీకి నోటీసులు రావడంతో .. తదుపరి విచారణ కీలకంగా మారింది. 

టాప్ హెడ్ లైన్స్

ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget