By: ABP Desam | Updated at : 25 Jun 2022 02:39 PM (IST)
సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్
Village Ward secretariat Volunteer Employees probation Declaration: అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారి ప్రొబేషన్ డిక్లరేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న అనంతరం నిర్వహించిన పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసింది. ఈ మేరకు డిక్లరేషన్ అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం నాడు జీవోఎంఎస్ నెంబర్ 5 జారీ చేసింది. జూలై నెల జీతాలు (ఆగస్టు 1న చెల్లించే)తో కొత్త వేతనాలను ఉద్యోగులకు అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
ఉద్యోగుల వేతనాలు ఖరారు..
సచివాలయ ఉద్యోగులతో పాటు పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్‌ను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. పంచాయతీ సెక్రటరీ, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు బేసిక్ పే రూ. 23,120 నుంచి రూ. 74,770 ఖరారు చేసింది. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 (డిజిటల్ అసిస్టెంట్), విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ 2, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 లాంటి ఇతర గ్రామ, వార్డు వాలంటీర్, ఇతర సచివాలయ ఉద్యోగులకు బేసిక్ పే రూ. 22,460 నుంచి రూ. 72,810 ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొబేషన్ డిక్లేర్ చేయడంతో పాటు వారికి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున చైర్మన్ కాకర్ల వెంకటరామి రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉద్యోగులు/ హోదా - పే స్కేల్
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించారు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ లాంటి ఉద్యోగాలపై ప్రకటన చేసి కొన్ని నెలల్లోనే వాటిని భర్తీ చేశారు. చెప్పినట్లుగానే ప్రొబేషన్ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ప్రొబేషన్ డిక్లరేషన్ పై జీవో విడుదల చేసింది ఏపీ సర్కార్. ఆత్మకూరు ఉప ఎన్నికల కారణంగా జీవో విడుదలకు ఆలస్యమైందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
Also Read: Ysrcp With BJP : బీజేపీ వెంటే జగన్, ఖరారు చేసిన రాష్ట్రపతి నామినేషన్, 2024 ముఖ చిత్రం ఇదేనా!
Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు
Breaking News Telugu Live Updates: కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి
Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి
CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన
ఏపీ రాజకీయ వేదికపై ఇంత వరకు చూడని సీన్ ఇవాళ మీరు చూడబోతున్నారు!
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!
Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!
NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్