అన్వేషించండి

VRAs in AP: వీఆర్ఏలపై వచ్చిన ఆ వార్త అవాస్తవం, అసలు నిజం ఇదీ - ఏపీ ప్రభుత్వం స్పష్టత

ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన విషయాలు పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేస్తూ ఏపీ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

వీఆర్ఏలకు ఏపీ సర్కారు వెన్నుపోటు పొడిచిందని పత్రికల్లో వచ్చిన వార్తలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన విషయాలు పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు వీఆర్ఏల భత్యాల విషయంలో స్పష్టత ఇచ్చింది.

వాస్తవాలు ఇవీ
‘‘గత ప్రభుత్వంలో ఆర్థిక విభాగం నుంచి 29.01.2019 న GO. MS. No.14 ద్వారా వీఆర్ఏల తాత్కాలిక కరవు భత్యాన్ని నెలకు రూ .300/- చొప్పున 01.01.2018 నుండి 01.06.2018 వరకు (కేవలం 5 నెలలకు) మాత్రమే పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంటే 01.06.2018 నుండి వీఆర్ఏలకు డీఏ వర్తించదు అనే ఉత్తర్వులను గత ప్రభుత్వమే ఇచ్చింది.

తదనుగుణంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు (Director, Treasury &Accounts - DTA) ఒక మెమో ద్వారా 5 నెలల కంటే ఎక్కువగా (GO. MS. No.14 ను అనుగుణంగా) డీఏ డ్రా చేసిన వీఆర్ఏల సమాచారాన్ని సేకరించమని DTA లకు తెలియజేశారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ.

తదుపరి అమరావతి జేఏసీతో పాటు ఇతర రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఈ విషయంపై ప్రస్తుత ప్రభుత్వానికి అభ్యర్థన పత్రాలను ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన GO. MS. No.14 ద్వారా వీఆర్ఏల కరువు భత్యానికి సంబంధించి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది మళ్లీ వీఆర్ఏల కరవు భత్యాన్ని పునరుద్దరించాలని కోరారు. ఈ ప్రభుత్వం  ఉద్యోగ సంఘాల సమస్యలను పరిశీలించడం, పరిష్కరించడం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారి ఆధ్వర్యంలో రెగ్యులర్ గా సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ సమావేశాలలో ఉద్యోగ సంఘాలకు సంబంధించిన  ఎజెండాలో భాగంగా  వీఆర్ఏల కరువు భత్యానికి సంబంధించిన అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. 

ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన వెంటనే సుమారు 3,795 మంది వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతి కల్పించడం జరిగింది. అదే విధంగా ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన GSWS ఉద్యోగ నియామకాలలో కూడా అర్హత కలిగిన సుమారు 2,880 మంది నామినీ VAO లను, వీఆర్ఏ లను కూడా గ్రేడ్-2 VRO లుగా నియమించడం జరిగింది. 

ఇటీవల 2023వ సంవత్సరంలో కూడా అర్హత కలిగిన 66 మంది వీఆర్ఏ లను VRO గ్రేడ్ -2 లుగా పదోన్నతి కల్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం వీఆర్ఏ లకు సంబంధించి అనేక ఉపయోగకర నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కేవలం ఉద్యోగుల్లో భయాందోళన కలిగించాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రతికూల వార్తలను ప్రముఖ పత్రిక ఈ రోజు ప్రచురించిందని స్పష్టంగా తెలుస్తోంది.

ప్రస్తుతం సుమారు 19,359 మంది వీఆర్ఏలు మన రాష్ట్రంలో సేవలు అందిస్తున్నారు. Director ,Treasury &Accounts వారు మెమో ఇచ్చినప్పటికీ ఏ ఒక్క వీఆర్ఏ నుండి కూడా  అదనంగా డ్రా చేసిన DA ను రికవరీ చేయలేదు. 

రెవెన్యూ విభాగం వారు వీఆర్ఏల నుండి DAకు సంబంధించి ఎటువంటి రికవరీ లేకుండా చేయడంతో పాటు, ప్రతి వీఆర్ఏ కు నెలకు రూ .300/- చొప్పున కరువు భత్యం (DA) కొనసాగించేలా తగిన ప్రతిపాదనలను తయారు చేశారు. ఈ ప్రతిపాదనలపై అతి త్వరలో నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వంపై బురద చల్లాలనే ఉద్దేశ్యంతో ఈరోజు పత్రికలో వీఆర్ఏల నుండి ప్రభుత్వం DA రికవరీ చేస్తుందని ప్రతికూల వార్తలను రాశారు. ఆ పత్రికలో పేర్కొన్న అంశాలు పూర్తిగా అవాస్తవం’’ అని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Siddaramaiah MUDA Case: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, ఈ 6న విచారణకు హాజరు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, ఈ 6న విచారణకు హాజరు
CM Revanth Reddy: 'రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు' - విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమన్న సీఎం రేవంత్
'రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు' - విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమన్న సీఎం రేవంత్
Embed widget