అన్వేషించండి

AP PRC: ఫిట్మెంట్ 23 శాతమే మంత్రుల కమిటీ స్పష్టం-హెచ్ఆర్ఏ శ్లాబుల కొత్త ప్రతిపాదనలు ఇవే

ఉద్యోగ సంఘ నేతలతో మంత్రుల కమిటీ చర్చలు జరుపుతోంది. కొత్త హెచ్ఆర్ఏ శ్లాబులు, పీఆర్సీ ఫిట్మెంట్ పై మంత్రుల కమిటీ ఉద్యోగుల సంఘాలకు స్పష్టత ఇచ్చింది. ఉద్యోగుల్లో ఉన్న అంతృప్తి, ఆవేదనను పరిష్కరించామని తెలిపింది.

సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశం కొనసాగుతోంది. హెచ్ఆర్ఏ శ్లాబుల విషయమై కొత్త ప్రతిపాదనలను మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘ నేతల ముందు ఉంచింది. 
హెచ్ఆర్ఏ శ్లాబుల కొత్త ప్రతిపాదనలు

  • 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 10 వేల సీలింగ్ తో 8 శాతం హెచ్ఆర్ఏ
  • 2 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 10 వేల సీలింగ్ తో 9.5 శాతం 
  • 5 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 12 వేల సీలింగ్ తో 13.5 శాతం 
  • 10 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 15 వేల సీలింగ్ తో 16 శాతం 
  • 25 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 20 వేల సీలింగ్ తో 16  శాతం
  • సెక్రటేరీయేట్, హెచ్వోడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు రూ. 23 వేల సీలింగ్ తో 24 శాతం

ఫిట్మెంట్ 23 శాతమే : మంత్రుల కమిటీ 

ఫిట్మెంట్ 23 శాతమే ఇస్తామని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకు తేల్చిచెప్పింది. ఐఆర్ రికవరీని చేయబోమని స్పష్టం చేసింది. మట్టి ఖర్చుల నిమిత్తం రూ. 25 వేల ఇచ్చేందుకు మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది. ఐదేళ్లకోసారి పీఆర్సీని అమలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రొబేషన్ అనంతరం కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు ఇస్తామని వెల్లడించింది. ఇంకా చర్చించాల్సిన అంశాలను ఎనామలీస్ కమిటీకి పంపుతామని ఉద్యోగ సంఘాలకు తెలిపింది. ఉద్యోగుల డిమాండ్లపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల డిమాండ్ లతో ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో ఆర్థికశాఖతో చర్చించాలన్నారు. ఫిట్‌మెంట్‌ 23 శాతంలో మార్పు ఉందని తెలిపారు. సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్‌(సీసీఏ) రద్దు చేయొద్దని ఉద్యోగులు కోరారన్నారు. హెచ్‌ఆర్‌ఏ పాత శ్లాబులే కొనసాగించాలని ఉద్యోగులు తమ దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని తెలిపారు. కనీస హెచ్‌ఆర్‌ఏ 12 శాతం ఉండాలని ఉద్యోగులు అడిగారన్నారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల సవరణతో రూ.7 వేల కోట్ల భారం పడే అవకాశం ఉందని సజ్జల అన్నారు. 

ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని పరిష్కరించాం: మంత్రి బొత్స 

పీఆర్సీపై ఆర్థికశాఖ అధికారులతో మంత్రుల కమిటీ శనివారం భేటీ అయింది. ఈ మధ్యాహ్నం పీఆర్సీ సాధన సమితి నేతలతో మంత్రులు సమాలోచనలు చేస్తున్నారు. పీఆర్సీ సాధన సమితి నాయకులు మంత్రుల కమిటీ శుక్రవారం అర్ధరాత్రి వరకూ చర్చలు జరిపారు.  ఐఆర్‌ రికవరీ చేయబోమని పీఆర్‌సీని ఐదేళ్లకొకసారి ఇస్తామని మంత్రుల కమిటీ నుంచి ఉద్యోగ సంఘ నేతలకు హామీ ఇచ్చింది. మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి, ఆవేదనకు పరిష్కారించామన్నారు.. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, ఐఆర్‌ రికవరీ విషయంలో స్పష్టత ఇచ్చామన్నారు. దీని వల్ల ప్రభుత్వంపై రూ.6 వేల కోట్ల అదనపు భారం ఉండొచ్చన్నారు. ఇక మిగిలిన సమస్యలు చిన్నవని, అవి కూడా త్వరలో పరిష్కారం అవుతాయన్నారు. చర్చల అనంతరం అన్ని అంశాలు సీఎం జగన్‌కు వివరిస్తామని మంత్రి బొత్స అన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు చల్లటి కబురు! ఏపీ, తెలంగామలోని జిల్లాల్లో వర్షాలు!
ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు చల్లటి కబురు! ఏపీ, తెలంగామలోని జిల్లాల్లో వర్షాలు!
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
YS Jagan PA KNR raids news 2026: లిక్కర్ స్కాం ఉచ్చులో జగన్ పీఏ కేఎన్ఆర్ - వందల కోట్ల ఆస్తులని ప్రచారం - అసలు టార్గెట్ మాజీ సీఎం ?
లిక్కర్ స్కాం ఉచ్చులో జగన్ పీఏ కేఎన్ఆర్ - వందల కోట్ల ఆస్తులని ప్రచారం - అసలు టార్గెట్ మాజీ సీఎం ?
Peddi Pre Release Event: విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్
విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
DK Shivakumar Swearing In: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
June 1 Rule Changes 2026:బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
Peddi Pre Release Event: విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్
విజయవాడలో 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్... మెయిన్ గెస్ట్ నుంచి డేట్, వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్
Full Case Study: 22 బిలియన్ డాలర్ల కంపెనీ బైజూస్ పతనం వెనుక దిగ్భ్రాంతికర విషయాలు, కుండలిలో 3 వినాశకరమైన యోగాలు!
22 బిలియన్ డాలర్ల కంపెనీ బైజూస్ పతనం వెనుక దిగ్భ్రాంతికర విషయాలు, కుండలిలో 3 వినాశకరమైన యోగాలు!
RGV Aaradhya Devi : ఆర్జీవీ హీరోయిన్ బోల్డ్ లుక్ - యూత్ 'ఆరాధ్య' దేవత
ఆర్జీవీ హీరోయిన్ బోల్డ్ లుక్ - యూత్ 'ఆరాధ్య' దేవత
Tejaswini Nandamuri: బాలకృష్ణ కూతురు డ్యాన్స్ అదుర్స్... తేజస్విని స్టెప్స్, ఆ వీడియో చూశారా?
బాలకృష్ణ కూతురు డ్యాన్స్ అదుర్స్... తేజస్విని స్టెప్స్, ఆ వీడియో చూశారా?
Rishabh Pant Steps Down: LSG కెప్టెన్సీ కి రిషభ్ పంత్ రాజీనామా: ఐపీఎల్ 2026 లో వరుస ఫెయిల్యూర్స్ తో కఠిన నిర్ణయం..
LSG కెప్టెన్సీ కి రిషభ్ పంత్ రాజీనామా: ఐపీఎల్ 2026 లో వరుస ఫెయిల్యూర్స్ తో కఠిన నిర్ణయం..
Embed widget