GPS Bill In AP: ఏపీలో ఉద్యోగులకు శుభవార్త - జీపీఎస్ బిల్లుకు గవర్నర్ ఆమోదం
GPS AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎస్ అమలు బిల్లుకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు.
Guaranteed Pension Scheme bill in ap government:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎస్ అమలు బిల్లుకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలపడంతో జీపీఎస్ బిల్లుపై గెజిట్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం జీపీఎస్ బిల్లు తీసుకొచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభించింది. ఈ క్రమంలో ప్రభుత్వం పంపిన జీపీఎస్ బిల్లుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో బేసిక్ శాలరీలో 50 శాతం పెన్షన్ భద్రత కల్పించేలా జీపీఎస్ చట్టం అమలు కానుంది.
గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) బిల్లులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో మార్పులు చేసింది. లోపాలను సవరిస్తూ బిల్లును మరోమారు కేబినెట్ ఆమోదానికి పంపించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా ఈ-ఫైల్ ద్వారా బిల్లును మంత్రులకు సర్క్యులేట్ చేసింది. జీపీఎస్‌లో ప్రతిపాదించిన పెన్షన్ టాప్ అప్‌పై నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ ప్రతిపాదనలు చేసింది. ఫ్యామిలీ పెన్షన్, మినిమమ్ పెన్షన్ ఎలా ఇవ్వాలన్న దానిపై బిల్లులో మార్పులు చేర్పులు చేసింది. జీపీఎస్ బిల్లులో తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలు ఆమోదించి పంపాలని మంత్రులకు ప్రభుత్వం సూచించింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులు జీపీఎస్‌లోనే కొనసాగేలా నిర్దేశిత గడువు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.
కొందరు ఉద్యోగులలో అసంతృప్తి
మరోవైపు కొందరు ఉద్యోగులు మాత్రం జీపీఎస్ బిల్లుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. తమ వాదనలు వినిపించుకోకుండా ప్రభుత్వం మొండిగా జీపీఎస్ బిల్లు తెచ్చిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దీనిపై వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కొన్ని ఉద్యోగ సంఘాలు అసంతృప్తిగా ఉన్నాయి. సీపీఎస్ రద్దు విషయంలో ఇంతకు మించి చేయలేమని.. సీపీఎస్ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని ఉద్యోగులను ప్రభుత్వం కోరుతోంది. జీపీఎస్ విధానంలో ఏమైనా చెప్పదల్చుకుంటే మేం చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. జీపీఎస్‌తో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెబుతోంది. సీపీఎస్ రద్దు చేశామని, కాబట్టి ఉద్యోగులు అర్ధం చేసుకుంటారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.
Also Read: AP Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 3,282 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేస్తోంది
ఏపీలోని ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ 'దసరా' కానుక
ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అక్టోబరు 21న డీఏ విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ 3.64 శాతం డీఏ విడుదల చేయనున్నారు. అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గెజిట్‌ను గవర్నర్ జారీ చేశారు.
ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పార్ట్ టైమ్ కరస్పాండెంట్ ఉద్యోగాలు, నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..