అన్వేషించండి

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో డీబీటీ లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ- ఒకట్రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తి

DBT Funds Releasing: ఆంధ్రప్రదేశ్‌లో ఆసరా, చేయూత, విద్యాదీవెన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఆయా పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది.

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు రాజకీయ దుమారానికి కారణమైన డీబీటీ పథకాల నిధుల విడుదల ప్రారంభమైంది. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను ప్రభుత్వం ఇచ్చింది. బుధవారం నుంచి నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు పేర్కొంది. 

బుధవారం ఒక్కరోజే లబ్ధిదారుల ఖాత్లాలో నిధులు జమ చేశామని ప్రభుత్వం వెల్లడించింది. ఆసరా పథకం కింద 1480 కోట్ల రూపాయలు విద్యాదీవెన కింద 502 కోట్లు విడుదల చేశారు. అన్ని పథకాలకు త్వరలోనే పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం  పేర్కొంది. 

రెండు మూడు రోజుల్లో అన్ని పథకాలకు నిధుల విడుదల పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. జనవరి నుంచి వివిధ పథకాలకు ఇవ్వాల్సిన నిధులను ప్రభుత్వం పోలింగ్‌కు రెండు రోజుల ముందు విడుదల చేయాలని ప్రయత్నించింది. దీనిపై ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పింది. ఇలా నిధులు విడుదల చేస్తే కచ్చితంగా ఎన్నికలపై ప్రభావం చూపినట్టు అవుతుందని అభిప్రాయపడిందని పేర్కొంది. 

ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ సానుభూతిపరులు, పథకాల లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఒక్కరోజు సమయం ఇచ్చి లబ్ధిదారుల ఖాతాల్లో  నగదు వేయాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా ప్రచార ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. నాయకులు కూడా దీనిపై ఎలాంటి ప్రకటనలు చేయొద్దని ఆదేశించింది. 

దీనిపై కూడా ఎన్నికల సంఘం అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఇన్ని రోజుల నుంచి ఇవ్వకుండా ఇప్పుడే ఇవ్వడానికి కారణాలు చెప్పాలని, అసలు అంత డబ్బులు ఇప్పుడు ఎక్కడ సర్దుబాటు చేస్తున్నారని ప్రశ్నించింది. 

ఎన్నికల సంఘం అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పోలింగ్‌కు ముందు రోజు పడాల్సిన నిధులు ఖాతాల్లో జమ కాకుండా పోయాయి. అయితే కోర్టులో వాదన సందర్భంగా పోలింగ్ తర్వాత రోజు నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో పోలింగ్ ముగియడంతో నిధుల పంపిణీ మొదలైంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Jr NTR: ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
Embed widget