By: ABP Desam | Updated at : 29 Jun 2022 09:07 PM (IST)
అమరావతి ఉద్యోగులకు మరో రెండు నెలల ఉచిత వసతి
Relief For Amaravati Employees : అమరావతి ఉద్యోగులకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాజధానిని అమరావతికి తరలించిన సమయంలో ఉద్యోగులకు వసతికి ఇబ్బంది అవుతుందని అప్పటి ప్రభుత్వం ఉచిత వసతి ఏర్పాటు చేసింది. ఈ సౌకర్యాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగులకు కేటాయించిన ఫ్లాట్లను గురువారంలోగా ఖాళీ చేసివ్వాలని సాధారణ పరిపాలనా శాఖ ఆదేశించింది. ఖాళీ చేసిన ఫ్లాట్‌లను అప్పగించినప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో.. ఇప్పుడు కూడా అలాగే అప్పగించాలని... ఏమైనా నష్టం జరిగి ఉంటే సంబంధిత ఉద్యోగులే భరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చిరంజీవి సరే పవన్‌ను ఎందుకు పిలవలేదు ? బీజేపీ దూరం పెడుతోందా ?
అయితే ఒక్క రోజులో ఖాళీ చేయడం సాధ్యం కాదని.. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ సంఘాల నేతల విజ్ఞప్తులతో చివరి క్షణంలో ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలలు పొడిగిచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన తరువాత అమరావతికి ఏపీ రాజధాని తరలించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులను వెంటనే అమరావతికి తరలించటం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సచివాలయం..శాఖల ప్రధాన కార్యాలయాల్లో పని చేస్తున్న ఏపీ ఉద్యోగులకు కొంత కాలం వసతి కల్పిస్తామని ముందుకొచ్చారు. వారి కోసం నాగార్జున యూనివర్సిటీ సమీపంలో వసతి కల్పించారు. ప్రభుత్వమే వారి వసతి ఖర్చు భరిస్తూ వచ్చింది.
జగన్‌కి పేరు , మాకు నిలదీతలు - ఈ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆవేదన చూస్తే
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మూడేళ్లుగా ప్రభుత్వమే వారికి ఉచిత వసతి కొనసాగిస్తోంది. ఈ సౌకర్యాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అక్టోబరు 31 తేదీ అనంతరం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ట్రాన్సిట్ వసతిని నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అప్పట్లో ఉద్యోగ సంఘాల నేతలు ఒత్తిడి చేయడంతో కొంత కాలం పొడిగించారు. రెండు నెలల కిందట మరో సారి జూన్ 30 వరకూ ఉచిత వసతి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మరోసారి రెండు నెలల పొడిగింపు ఇచ్చారు. ఏపీ సచివాలయం, శాసనసభ, హెచ్‌ఓడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్‌భవన్ ఉద్యోగులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుంది. మిగతా వారు ఇప్పటికే సొంత వసతిని చూసుకున్నారు.
Nellore TDP : నెల్లూరులో రూ.70 కోట్ల భూ కుంభకోణం, కలెక్టర్ పై టీడీపీ సంచలన ఆరోపణలు!
Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య
AP Govt Employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఈహెచ్ఎస్ కార్డుతో వేరే రాష్ట్రాల్లో ట్రీట్మెంట్
Payyavula Letter : ఏపీలో ఆర్టీఐ చట్ట ఉల్లంఘన - తక్షణం జోక్యం చేసుకోవాలని సీఎస్‌కు పయ్యావుల లేఖ
Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!
Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇక ఆన్లైన్లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!
చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?