అన్వేషించండి

AP Movie Tickets New Rules : ఏపీ ప్రభుత్వ ఆన్‌లైన్ టిక్కెట్ పోర్టల్ "యువర్ స్క్రీన్స్" - రేట్లు తక్కువగా ఉంటాయన్న ఏపీ ప్రభుత్వం !

సినిమా టిక్కెట్ పోర్టల్ పేరును ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తక్కువ ధరకే టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

AP Movie Tickets New Rules : ఆంధ్రప్రదేశ్‌లో ఇక ప్రభుత్వం నిర్ధేశించిన ధరకే సినిమా టికెట్ లు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.  బ్లాక్ టికెటింగ్ విధానానికి స్వస్తిపలికి ప్రజలకు తక్కువ ధరకే వినోదం అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో  ప్రభుత్వం ఏపీ ఎఫ్ డీసీ  పోర్టల్ ‘యువర్ స్క్రీన్స్’ అందుబాటులోకి తీసుకురానుంది. ప్రభుత్వ గెట్‌వే నుంచి టికెట్ బుకింగ్ చేసుకుంటే ప్రేక్షకుడిపై ఎలాంటి అదనపు భారం పడదు.  ప్రభుత్వం తెచ్చిన ఆన్ లైన్ విధానం వల్ల తాము నష్టపోతామని భావిస్తున్న  థియేటర్ల యాజమాన్యం, ఎగ్జిబిటర్లు వెలిబుచ్చిన సందేహాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదలచేసింది. 

యువర్ స్క్రీన్స్  పేరుతో ఏపీఎస్‌ఎస్‌ఎఫ్‌డీసీ ఆన్‌లైన్ పోర్టల్ 

ఏదైనా కొత్త సినిమా విడుదలైందంటే  యువర్ స్క్రీన్స్ అనే పోర్టల్ ద్వారా తక్కువ ధరకే సినిమా టికెట్ బుక్ చేసుకుని ఇంటిల్లిపాది సంతోషంగా వినోదం ఆస్వాదించవచ్చని ప్రభుత్వం తెలిపింది.  ఇతర పోర్టల్ లలో టికెట్ బుకింగ్ చేసుకుంటే టికెట్ పై అదనంగా రూ.20 నుండి రూ.25 వరకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రేక్షకుడిపై భారం పడుతుందని గ్రహించిన ప్రభుత్వం వాటికి అడ్డుకట్ట వేసే దిశగా ఆలోచించి యువర్ స్క్రీన్స్ ను అందుబాటులోకి తేవడం ద్వారా ప్లాట్ ఫామ్ ఛార్జీగా టికెట్ పై  కేవలం 1.95 శాతం మాత్రమే అంటే సున్నా ఛార్జీ పడుతుందని ప్రకటనలో పేర్కొననారు.  ఆ లెక్కన ఒక్కో టికెట్ పై ప్రేక్షకుడికి సుమారు రూ.25 భారం తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. 

ఇతర టిక్కెటింగ్ యాప్‌లూ ఉపయోగించుకోవచ్చన్న ప్రభుత్వం 

 ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ పోర్టల్ లతో థియేటర్ల వారికి ప్రత్యేక ఏర్పాటు ఉంది. అగ్రిమెంట్ ఎవరైతే చేసుకున్నారో అప్పటికి ప్రభుత్వ ఎగ్జిస్టింగ్ జీవో ప్రకారం కేవలం 50 శాతం సీట్లు మాత్రమే ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో థియేటర్ల వారికి తమ డబ్బు తమకు సక్రమంగా రాదనే అపోహలు అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. థియేటర్లకు రోజువారీగా అంటే ఏ రోజుకు ఆ రోజే డబ్బు బదలాయింపు జరుగుతుందని ఎంవోయూలో స్పష్టంగా పేర్కొన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఇప్పటికే బుకింగ్ సర్వీస్ అందిస్తున్న అగ్రిగేటర్స్ కి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువరించిన నాటికి అంటే 17.12.2021 నాటికి ఉన్న అగ్రిమెంట్లను కొనసాగిస్తూ ఎంవోయూలో స్పష్టంగా తెలియజేయడం జరిగిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

యువర్ స్క్రీన్స్ ద్వారా తక్కువ ధరకే టిక్కెట్లు 

ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ పోర్టల్ లతో పాటు ప్రభుత్వం తీసుకువచ్చిన యువర్ స్క్రీన్స్ ద్వారా కూడా ప్రేక్షకులు టికెట్ బుక్ చేసుకునే అవకాశం థియేటర్లు కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఇందుకు అవసరమైన హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను కూడా ప్రభుత్వమే అందిస్తుందని.. ప్రేక్షకుడు రేటుతో సంబంధం లేకుండా తనకు నచ్చిన పోర్టల్ నుండి  టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం టికెట్ రేటును నిర్ధేశించడం వల్ల రోజువారీగా ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయి, ఎంత రేటుకి అమ్ముడయ్యాయి, ఎంత జీఎస్టీ వసూలైందనే వివరాలు తెలుస్తాయని తద్వారా పన్ను ఎగవేతకు అవకాశం ఉండదని, ప్రేక్షకుడికి ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Worldbank funds to Amaravati: అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల  3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల 3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
Telangana Latest News: తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి
తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి
Supreme Court judges Assets: ప్రజల ఎదుట ఆస్తుల వివరాలు - సుప్రీంకోర్టు జడ్జిల కీలక నిర్ణయాలు
ప్రజల ఎదుట ఆస్తుల వివరాలు - సుప్రీంకోర్టు జడ్జిల కీలక నిర్ణయాలు
Prakash Raj: పవన్ కల్యాణ్ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? - డిప్యూటీ సీఎంకు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్
పవన్ కల్యాణ్ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? - డిప్యూటీ సీఎంకు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs SRH Match Preview IPL 2025  ఈడెన్ లో దుల్లగొట్టేసి ఫామ్ లోకి వచ్చేయాలని సన్ రైజర్స్Virat Kohli Sympathy Drama IPL 2025 | కొహ్లీ కావాలనే సింపతీ డ్రామాలు ఆడాడాSiraj Bowling vs RCB IPL 2025 | మియా మావ బౌలింగ్ కి..వణికిపోయిన ఆర్సీబీRCB vs GT IPL 2025 Match Trolls | అయ్యిందా బాగా అయ్యిందా అంటున్న CSK, MI ఫ్యాన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Worldbank funds to Amaravati: అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల  3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల 3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
Telangana Latest News: తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి
తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి
Supreme Court judges Assets: ప్రజల ఎదుట ఆస్తుల వివరాలు - సుప్రీంకోర్టు జడ్జిల కీలక నిర్ణయాలు
ప్రజల ఎదుట ఆస్తుల వివరాలు - సుప్రీంకోర్టు జడ్జిల కీలక నిర్ణయాలు
Prakash Raj: పవన్ కల్యాణ్ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? - డిప్యూటీ సీఎంకు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్
పవన్ కల్యాణ్ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? - డిప్యూటీ సీఎంకు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్
MAD Square: 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ మీట్‌కు జూనియర్ ఎన్టీఆర్ - బావమరిది కోసం
'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ మీట్‌కు జూనియర్ ఎన్టీఆర్ - బావమరిది కోసం
Hyderabad Weather: తెలంగాణలో మారిన వాతావరణం- హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో గాలి వాన  
తెలంగాణలో మారిన వాతావరణం- హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో గాలి వాన  
Ram Charan: 'చిరుత' నుంచి 'పెద్ది' వరకు... రామ్ చరణ్ సినిమాల ఆడియో రైట్స్ - లిస్ట్‌లో టాప్ ఏది? లాస్ట్‌ ఏదో తెలుసా?
'చిరుత' నుంచి 'పెద్ది' వరకు... రామ్ చరణ్ సినిమాల ఆడియో రైట్స్ - లిస్ట్‌లో టాప్ ఏది? లాస్ట్‌ ఏదో తెలుసా?
HCU Land Dispute: కంచ గచ్చిబౌలి భూమిపై సుప్రీం కీలక నిర్ణయం- హైకోర్టు రిజిస్ట్రార్, సీఎస్‌కు ఆదేశాలు 
కంచ గచ్చిబౌలి భూమిపై సుప్రీం కీలక నిర్ణయం- హైకోర్టు రిజిస్ట్రార్, సీఎస్‌కు ఆదేశాలు 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.