AP Free Bus Guidelines: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ, ఆ బస్సుల్లో మాత్రమే
Free Bus in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ ‘సూపర్ సిక్స్’ హామీలు స్త్రీ శక్తిలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది.

Free Bus For Women Guidelines | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ప్రయాణ ఖర్చు తగ్గించే దిశగా నిర్ణయం తీసుకుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల హామీల్లో భాగంగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విధానం ప్రారంభించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వచ్చే వారం నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. ఉచిత బస్సు పథకం అమలుకు ఏపీ కేబినెట్ భేటీలో అమలు తెలపనున్నారు.
ఆగస్టు 15, 2025 నుంచి అమలు ప్రారంభం
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలులోకి రానుంది.
ఎలాంటి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు?
మహిళలకు ఫ్రీ బస్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ నిర్వహించే కొన్ని ప్రధాన బస్సుల్లో మాత్రమే వారికి ఉచిత ప్రయాణ సదుపాయం లభిస్తుంది.
ఈ బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం
పల్లెవెలుగు
అల్ట్రా పల్లెవెలుగు
ఎక్స్‌ప్రెస్
అల్ట్రా ఎక్స్‌ప్రెస్
ఈ సేవల్లో జీరో టికెట్ విధానం అమలులోకి వస్తుంది. అంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
ఎక్కడి నుంచి ఎక్కడికైనా
రాష్ట్రం వరకు ఎలాంటి పరిమితులు లేకుండా ప్రయాణం చేయవచ్చు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి అయినా మహిళలు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది పూర్తిగా రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యే పథకం.
ప్రయాణానికి అవసరమయ్యే గుర్తింపు పత్రాలు
ప్రస్తుతం పూర్తి వివరాలు తెలియజేయనప్పటికీ, ప్రయాణ సమయంలో ఒక ఫోటో ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా చూపించాలి. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి లాంటి ఒక ఐడీ ప్రుఫ్ చూపించాల్సి వచ్చే అవకాశం ఉంది.
ప్రభుత్వ ప్రకటనలో ముఖ్యాంశాలు
▪️ ఈ పథకం 'సూపర్ సిక్స్' హామీలలో భాగంగా ప్రారంభించడం
▪️ ఇతర రాష్ట్రాలు (కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ)లలో పథకాన్ని పరిశీలించి ఇక్కడ అమలు చేయాలని నిర్ణయం
▪️ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉచిత బస్సు పథకం మహిళలకు అందుబాటులో ఉంటుంది
వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ లబ్ధి
పిల్లల నుంచి వృద్ధ మహిళల వరకు.. అన్ని వయస్సుల మహిళలు ఈ ప్రయోజనాన్ని పొందగలుగుతారు.
అధికారిక వెబ్‌సైట్ & సమాచారం
త్వరలో ప్రత్యేక హెల్ప్‌లైన్, లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా మరింత సమాచారం అందించనున్నట్లు సమాచారం. తాజా వివరాలకు https://aptransport.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం కోసం మరో అడుగు
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ప్రయాణ ఖర్చు భారం తగ్గించడమే కాక, వారి ఆత్మవిశ్వాసం పెంచేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం – ఇది మహిళల సాధికారత వైపు ఒక గొప్ప ముందడుగు.
ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ప్రారంభం ?
ఏపీలో ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు 15, 2025న ప్రారంభం
ఈ పథకం కింద అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణమా?
AP Free Bus Guidelines 2025 ప్రకారం అన్ని బస్సుల్లో కాదు. కేవలం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ రకాల బస్సుల్లో ఈ స్కీమ్ మాత్రమే వర్తిస్తుంది.
డాక్యుమెంట్లు అవసరమా?
ప్రాథమికంగా Photo ID అవసరం ఉండొచ్చు. అధికారుల నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు.






















