Free Bus Scheme in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంపై బిగ్ అప్‌డేట్!
Free Bus Scheme in Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం మరో క్లారిటీ ఇచ్చింది. మంత్రి రాంప్రసాద్ స్పందించి కీలక విషయాలు చెప్పారు.

Free Bus Scheme in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. అందుకే దీనికి సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయానికి బుధవారం జరిగే కేబినెట్ భేటీ ఆమోదించబోతోంది. అప్పుడు ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలపై క్లారిటీ రానుంది.
ఆంధ్రప్రదేశ్ మహిళకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని స్పష్టమైంది. రవాణా శాఖమంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన చేశారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా వెళ్లిరావచ్చని మంత్రి వెల్లడించారు.
ఎన్నికల టైంలో శ్రీశక్తిపేరుతో టీడీపీ తన మ్యానిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పథకాన్ని అమలులోకి తీసుకొస్తోంది. ఆగస్టు 15న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.
ఎవరు అర్హులు
ఈ పథకానికి రాష్ట్రంలోని మహిళలంతా అర్హులేనని ప్రభుత్వం ప్రకటించింది. ఎలాంటి పరిధిలు లేవని ప్రకటించింది. ఎవరు ఎక్కడి నుంచైనా ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. మొదట్లో జిల్లాకే పరిమితం చేయాలని భావించారు. అంటే ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలోనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని భావించారు. కానీ ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఎన్నికల ముందు అందరికీ, రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం జిల్లాకు పరిమితం చేస్తామని ప్రకటనలు చేయడం ఏంటని ప్రత్యర్థులు విమర్శలు మొదలు పెట్టారు. ప్రజల నుంచి కూడా నెగెటివ్ ఫీడ్ రావడంతో ప్రభుత్వం పునరాలోచన చేసింది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని క్లారిటీ ఇచ్చింది.
ఆర్టీసీ బస్‌లో ఫ్రీగా ప్రయాణం చేయాలంటే ఏం కావాలి?
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. దీనికి కొన్ని గుర్తింపు కార్డులు అవసరం అవుతాయి. ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులో ఏదైనా ఉంటే చాలు, మీరు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా 6700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. దీని కోసం దాదాపు రెండువేల కోర్టు ఖర్చు పెట్టనున్నారు. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయనుంది.





















