Free Education: విదేశాల్లో చదువుకోవాలనే కల ఇలా నెరవేర్చుకోండి! ఈ దేశాల్లో ఫీజు లేదు, స్టైఫండ్ ఇస్తారు!
Free Education: జర్మనీ, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ వంటి దేశాల్లో విద్యార్థులకు ఉచిత విద్య లేదా తక్కువ ఖర్చుతో విద్య అందుబాటులో ఉంది.

Free Education: నేటి కాలంలో భారతదేశంతో సహా అనేక దేశాల్లో మంచి విద్యను అభ్యసించడం ఖరీదవుతోంది. విదేశీ కంట్రీల్లో చదువుకోవడం కూడా కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలా దేశాలు విదేశీ విద్యార్థులకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో కూడిన విద్యను అందిస్తున్నాయి. అంతే కాకుండా ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత వారికి ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాయి. చదువుకునే సమయంలో సౌకర్యాలు, స్టైఫండ్ ఇస్తున్నాయి. మీరు కూడా విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కలలు కంటున్నట్లయితే, ఫీజు గురించి ఆందోళన చెందుతుంటే, ఈ వార్త మీ కోసం.
ఫిన్లాండ్
ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా తరచూ వింటూనే ఉంటాం. ఇక్కడ బ్యాచిలర్స్, మాస్టర్స్, పీహెచ్‌డీ అన్ని స్థాయిలలో ఉచిత విద్య అందుబాటులో ఉంది. ముఖ్యంగా పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులకు చదువుతో పాటు స్టైపెండ్ అంటే జీతం కూడా ఇస్తారు. ఇక్కడ స్వీడిష్ లేదా ఫిన్నిష్ భాషలో కోర్సు చేసే ఏ విదేశీ విద్యార్థికైనా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జర్మనీ
విద్య విషయంలో జర్మనీ ప్రపంచంలోని అగ్ర దేశాలలో ఒకటిగా పరిగణిస్తుంటారు. ఇక్కడ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో జర్మన్ విద్యార్థులే కాకుండా, విదేశీ విద్యార్థుల నుంచి కూడా ట్యూషన్ ఫీజులు తీసుకోరు. కేవలం నామమాత్రపు అడ్మిషన్ ఫీజు (సుమారు రూ. 11,000) వసూలు చేస్తారు. ఇది విశ్వవిద్యాలయ సౌకర్యాల నిర్వహణ, విద్యార్థుల శ్రేయస్సు కోసం ఉపయోగిస్తుంటారు. జర్మనీలో దాదాపు 300 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఇవి 1000 కంటే ఎక్కువ కోర్సులను అందిస్తున్నాయి.
నార్వే
నార్వే కూడా విద్యార్థులకు చదువు విషయంలో స్వర్గధామం లాంటింది. ఇక్కడ పాఠశాల నుంచి పీహెచ్‌డీ వరకు విద్య పూర్తిగా ఉచితం. విదేశీ విద్యార్థులకు కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే, ఇక్కడ చదువుకోవడానికి నార్వేజియన్ భాష వచ్చి ఉండాలి. విశ్వవిద్యాలయాలు విద్యార్థుల నుంచి ఒక్కో సెమిస్టర్‌కు 30-60 యూరోల సాధారణ రుసుము వసూలు చేస్తాయి, దీనితో వారికి ఆరోగ్యం, కౌన్సెలింగ్, క్రీడలు, క్యాంపస్ సౌకర్యాలు లభిస్తాయి.
స్వీడన్
స్వీడన్ కూడా విద్య విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ యూరోపియన్ యూనియన్, స్వీడన్ శాశ్వత నివాసితులకు ఉచిత విద్యను అందిస్తారు. అయితే, ఇతర విదేశీ విద్యార్థులు నామమాత్రపు ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ఇక్కడ పీహెచ్‌డీ చదువు విదేశీ విద్యార్థులకు కూడా పూర్తిగా ఉచితం, దీని కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఇక్కడ ప్రవేశం పొందుతారు.





















