Schools Covid: పాఠాశాలలపై కరోనా పంజా... గురుకుల పాఠశాలలో 20 మందికి కోవిడ్... గుంటూరులో ఇద్దరు టీచర్లకు పాజిటివ్..!
రాష్ట్రంలో కరోనా విస్తరిస్తోంది. కరోనా ప్రభావం సూళ్లలోనూ కనిపిస్తుంది. తాజాగా గుంటూరు, అనంతపురం జిల్లాలోని పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది కరోనా బారినపడ్డారు.
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. సంక్రాంతి తర్వాత కేసులు అమాంతం పెరిగిపోయాయి. రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పండుగ తర్వాత సూళ్ల రీఒపెన్ పై విపక్షాలు ఆందోళన వ్యక్తలు చేశాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని కోరాయి. అయితే విద్యాశాఖ మాత్రం తరగతుల నిర్వహణకే మొగ్గుచూపింది. ఇప్పుడు కరోనా క్రమంగా పాఠశాలలపై ప్రభావం చూపుతోంది. గుంటూరు జిల్లాలోని ఓ పాఠశాలలో ఇద్దరు టీచర్లకు కరోనా సోకింది. టేకులోడు గురుకుల పాఠశాలలో దాదాపు 20 మందికి కోవిడ్ నిర్థారణ అయింది.
Also Read: పీఆర్సీ జీవోలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు.. సోమవారం విచారణ
ఇద్దరు టీచర్లకు పాజిటివ్
గుంటూరు జిల్లా క్రోసూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు టీచర్లకు కరోనా సోకింది. రెండు రోజుల క్రితం ఒకరికి కరోనా పాజిటివ్ రాగా తాజాగా మరొక టీచర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. స్కూల్ లోని ఇద్దరు టీచర్లకు కరోనా సోకడంతో వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు ఉన్న 53 మంది విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ అదికారులు పరీక్షలు నిర్వహించారు. కరోనా నిర్థారణ పరీక్ష రిపోర్టుల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.
Also Read: బీజేపీ అంటే ఫ్లవర్ కాదు ఫైర్... నిప్పుతో చెలగాటమాడవద్దని జగన్‌కు నేతల హెచ్చరిక !
గురుకుల పాఠశాలలో కరోనా కలకలం
అనంతపురం జిల్లా టేకులోడులోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల, కళాశాలలో కరోనా కలకలం రేపింది. ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇళ్లకు వెళ్లి తిరిగి వచ్చిన విద్యార్థినిలలో కొందరు తీవ్రజ్వరంతో బాధపడుతున్నట్లు ఉపాధ్యాయులు గుర్తించారు. దీంతో పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థినిలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 15 ఉపాధ్యాయులు, ఒక హెల్పర్, భోజనశాల సిబ్బందిలో ఇద్దరికి దాదాపుగా 20 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. వైద్యుల సూచనల మేరకు కరోనా వచ్చిన వారిని వెంటనే హోమ్ ఐసోలేషన్ కు తరలించారు. ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు. జ్వరం, జలుబు లక్షణాలు ఉన్న బాలికలను వారి తల్లిదండ్రులను పిలిపించి ఊర్లకు పంపించేశారు. ఎప్పటికప్పుడు వైద్య సేవలు ఉపయోగించుకోవాలని డాక్టర్ విజయ్ సూచించారు. పాఠశాల, కళాశాలలో దాదాపు 800 విధ్యార్థినులు ఉన్నారు. శుక్రవారం 80 మంది విద్యార్థినిలకు కరోనా పరీక్షలు చేయగా ఇంకా ఫలితాలు రావాల్సిఉంది. కరోనా కలకలంతో తమను ఇంటికి పంపాలని విద్యార్థినిలు కోరుతున్నారు.
Also Read: ఇవిగో గుడివాడ కేసీనో ఆధారాలు... రిలీజ్ చేసిన టీడీపీ !