By: ABP Desam | Updated at : 13 Feb 2023 07:43 PM (IST)
పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం భేటీ ముగిసింది. 20-30 మంది ఎమ్మెల్యేలు ఇంకా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లడం లేదని వారిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉన్న ప్రాంతంలో గడప గడపకి బ్రేక్ ఇచ్చి తర్వాత కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ నెల 20న జరిగే మా భవిష్యత్ నువ్వే జగన్ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు చురుగ్గా పాల్గొనాలని పార్టీ విస్తృతసాయి సమావేశం జగన్ ఆదేశించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో.. ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లతో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సోమవారం సాయంత్రం సమీక్షా సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ప్రారంభించనున్న కార్యక్రమాలపై పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. 93 శాతం గృహసారథుల నియామకం పూర్తయ్యింది. దాదాపు 5 లక్షల మంది గృహసారథులను నియమించుకున్నాం. ఫిబ్రవరి 16 లోగా అక్కడక్కడా మిగిలిపోయిన నియామకాలను పూర్తిచేయాలి. పార్టీ కార్యక్రమాలు నిరంతరరాయంగా జరగాలంటే గృహసారథులనేవాళ్లు చాలా ముఖ్యమైనవారని జగన్ సూచించారు.
‘గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల మొదటి బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాలు 387 మండలాల్లో ముగిశాయి. రెండో బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాలు మిగిలిన మండలాల్లో రేపటి (ఫిబ్రవరి 14) నుంచి ప్రారంభమై, ఫిబ్రవరి19 వరకూ నడుస్తాయి. మండలాల వారీగా జరిగే ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. ఈ శిక్షణ కార్యక్రమాలు ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి. సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల రూపేణా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి సుమారు 5.65 లక్షల మందితో క్షేత్రస్థాయిలో పార్టీ సైన్యం ఉంది. వీరంతా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 1.65 కోట్ల గృహాలను సందర్శిస్తారు.
మార్చి 18 నుంచి 26 వరకూ కూడా జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్‌ను పార్టీకి చెందిన సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు డోర్ టు డోర్ నిర్వహిస్తారు. గత ప్రభుత్వం కన్నా.. ఈ ప్రభుత్వం అందించిన మెరుగైన పాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తారు. గృహసారథులను కో–ఆర్డినేట్ చేసే బాధ్యతను సచివాలయ కన్వీనర్లకు అప్పగించాలి’ అని సీఎం జగన్ సూచించారు.
గడప గడపకూ మన ప్రభుత్వంపైన కూడా ముఖ్యమంత్రి సమీక్ష.
ఇప్పటివరకూ దాదాపు 7447 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం నిర్వహించినట్లు సీఎం జగన్ కు నేతలు తెలిపారు. ఎమ్మెల్యేలు సగటున నెలలో సుమారు 6 సచివాలయాలను సందర్శిస్తున్నారు. గడపగడపకూ కార్యక్రమం నిర్వహణ అత్యంత కీలకమనిసీఎం మరోసారి స్పష్టంచేశారు. నిర్దేశించుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్నారు. ప్రతి ఇంట్లో ఉన్నవారిని కూడా పలకరించి వారితో కొంత సమయం గడపాలన్నారు సీఎం జగన్. సుమారు 14 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, కొన్ని మీడియా సంస్థలు టీడీపీతో కలిసి ఉన్నది లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా అవి చూపిస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలని వైసీపీ నేతలకు జగన్ సూచించారు. టీడీపీ నేతలు ప్రజలకు నిరంతరం ఏదో ఒక భ్రమ కల్పించే పనులు చేస్తున్నారని, వాటిని తిప్పికొడుతూ మనం ముందుకు సాగాలని దిశా నిర్దేశం చేశారు. గ్రాడ్యుయేట్లు, టీచర్లకు సంబంధించిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పరిశీలకులు వీరంతా కలిసికట్టుగా పనిచేయాలన్న సీఎం జగన్ సూచించారు.
Political Panchamgam : ఏ పార్టీ పంచాంగం వారిదే - రాజకీయ పార్టీల ఉగాది వేడుకల్లో ఏం చెప్పారంటే ?
Swaroopanandendra: తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు బాగున్నాయి, ప్రధానిది కూడా - స్వరూపానందేంద్ర స్వామి
Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?
Narasarao pet News : కోటప్పకొండ అభివృద్ధిపై చర్చకు సవాళ్లు - నర్సరావుపేటలో టీడీపీ నేత అరెస్ట్ !
CM Jagan Ugadi: ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు, తెలుగుదనం ఉట్టిపడేలా సీఎం వస్త్రధారణ
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?
IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్