అన్వేషించండి

AP Cabinet Meeting Decisions June 2026: అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు - ఏపీ కేబినెట్‌లో సంచలన నిర్ణయాలు

Chandrababu Serious on AgriGold issue: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఏపీ సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేకంగా 31 కొత్త పోస్టులను మంజూరు చేశారు.

Agri Gold Victims: ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కఠిన వైఖరి అవలంబించారు. అమరావతి సచివాలయంలో గురువారం  నాడు సుమారు మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్ అంశంపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అధికారుల అలసత్వం అడ్డంకిగా మారడంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  

 ఉన్నతాధికారులపై ముఖ్యమంత్రి నిప్పులు 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో అగ్రిగోల్డ్ ఇష్యూ ప్రస్తావనకు రాగానే వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బాధితుల సమస్యల పరిష్కారం కోసం తక్షణమే ఏర్పాటు చేయాల్సిన కేబినెట్ సబ్ కమిటీ  ప్రక్రియ ఎందుకు పెండింగ్‌లో పడిందంటూ సీఎం అధికారులను నిలదీశారు.  బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ, యంత్రాంగంలో ఈ స్థాయి నిర్లక్ష్యం ఏంటి  అంటూ ఉన్నతాధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన అంశాల్లో తాత్సార్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.

 ఆరు నెలల డెడ్‌లైన్ - మంత్రుల బృందం ఏర్పాటు 

గత ప్రభుత్వాల హయాంలో అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్‌మెంట్, నిధుల రికవరీ ప్రక్రియలో జరిగిన లోపాలను, సిఐడి   అధికారుల వైఖరిని ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ సమస్యను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా, త్వరలోనే మంత్రుల బృందాన్ని అధికారికంగా రంగంలోకి దించబోతున్నట్లు సీఎం ప్రకటించారు. రాబోయే ఆరు నెలల కాలంలోనే అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాధితుల క్లెయిమ్‌లను పరిశీలించి, వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా కార్యాచరణ ముగించాలని అధికారులకు ఖచ్చితమైన డెడ్‌లైన్‌ విధించారు.

 వేగవంతానికి 31 కొత్త పోస్టుల మంజూరు 

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, సమస్యను వేగంగా కొలిక్కి తెచ్చేందుకు చంద్రబాబు కేబినెట్ ఒక కీలకమైన పరిపాలనా నిర్ణయాన్ని తీసుకుంది. అగ్రిగోల్డ్ కేసుల విచారణను, లీగల్ కాంప్లికేషన్లను త్వరితగతిన క్లియర్ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా 31 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త పోస్టుల్లో న్యాయ నిపుణులు, రెవెన్యూ అధికారులు , అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఉంటారు. వీరి ద్వారా బాధితుల దరఖాస్తుల స్క్రీనింగ్,  ఆస్తుల వేలం ప్రక్రియ వేగవంతం కానుంది.

అమరావతి అభివృద్ధి, ఇతర కీలక కేబినెట్ నిర్ణయాలు 

అగ్రిగోల్డ్ ఇష్యూతో పాటు ఈ కేబినెట్ భేటీలో రాజధాని అమరావతి అభివృద్ధిపై సర్కార్ పెద్ద పీట వేసింది. అమరావతి హైకోర్టు పరిసర ప్రాంతాల్లో రూ. 547 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల కల్పనకు, అలాగే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దాదాపు 20కి పైగా కీలక ఎజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రుల మండలి.. రాష్ట్రంలో ఉపాధి కల్పన, మౌలిక వసతులు మరియు కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలకు అనుమతులు మంజూరు చేసింది.
 
దాదాపు 11 లక్షలకు పైగా బాధితులు ఉన్న అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని త్వరగా ముగించాలన్న చంద్రబాబు సర్కార్ నిర్ణయం వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సీఎం స్వయంగా గడువు విధించి, కొత్త పోస్టులను మంజూరు చేయడం ద్వారా ఈ ప్రక్రియలో ఇకపై జాప్యానికి తావుండదని స్పష్టమైన సంకేతాలు పంపినట్లయింది. మరి ఈ కొత్త 31 పోస్టుల నియామకం, కేబినెట్ సబ్ కమిటీల నివేదికల అనంతరం ఆరు నెలల్లో బాధితుల చేతికి డబ్బులు ఎలా అందుతాయనేది వేచి చూడాలి. 


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget