అన్వేషించండి

AP Cabinet: ఏపీలో రూ.99 నుంచి అందుబాటులోకి మద్యం - నూతన మద్యం పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Andhra News: ఏపీలో నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచాలని.. సగటు మద్యం ధర రూ.99కే లభించేలా చూడాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

AP Cabinet Approves New Liquor Policy: ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు ఉంచాలని.. సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని రాష్ట్ర కేబినెట్ (AP Cabinet) నిర్ణయించింది. ఈ మేరకు నూతన మద్యం పాలసీకి బుధవారం ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ఈ పాలసీ అమల్లోకి రానుంది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.  అటు, వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపైనా కేబినెట్‌లో చర్చించారు. గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాల పరిమితి ముగిసిందని.. ఏడాది క్రితమే వాలంటీర్లను జగన్ తొలగించారని మంత్రులు తెలిపారు.

2023లో వాలంటీర్ల  పదవీ కాలం ముగిసినా రెన్యువల్ చేయలేదని చెప్పారు. తప్పుడు విధానాలు, దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని అన్నారు. వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. 

గత ప్రభుత్వంలో సాక్షి పత్రిక కొనుగోళ్ల పేరిట జరిగిన అవకతవకలపై కేబినెట్‌లో చర్చించారు. ప్రభుత్వ ఖజానా నుంచి సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం రెండేళ్లలోనే రూ.205 కోట్లు ఖర్చు చేశారని మంత్రులు తెలిపారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. అలాగే, సచివాలయాలు, వాలంటీర్లకు దిన పత్రికల కొనుగోలుకు నెలనెలా ఇచ్చే రూ.200 రద్దు చేస్తూ నిర్ణయించారు.

మరిన్ని నిర్ణయాలు

  • సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే దీపావళి నాటికి మహిళలకు కానుక ఇవ్వాలనే అంశంపైనా భేటీలో చర్చించారు.
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించే అంశంపైనా సీఎం మంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. మహిళలకు ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను ఇచ్చే పథకంపై కూడా మంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది.
  • చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలిలో తీర్మానించారు. దీనిపై మంత్రివర్గం కేంద్రానికి సిఫార్సు చేసింది.
  • పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సీడబ్ల్యూసీ సూచనల మేరకు పాత ఏజెన్సీకి ఇవ్వాలని నిర్ణయం. ఒకే ఏజెన్సీకి పనులు కేటాయించడం వల్ల ఏమైనా సమస్యలు వస్తే ఏజెన్సీ బాధ్యత ఉంటుందని మంత్రివర్గం అభిప్రాయపడింది.
  • ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ 'స్టెమీ' పథకం ప్రారంభం
  • ఆధార్ తరహాలో విద్యార్థులకు 'అపార్' గుర్తింపు కార్డులు జారీ.
  • హోంశాఖలో రూ.10 కోట్ల కార్పస్ ఫండ్‌తో కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం.
  • అలాగే, వాలంటీర్లను సచివాలయాల్లోని వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధుల విడుదలకు ఆమోదం. మొత్తం 18 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Also Read: Tirumala Darshan Tickets: ఈ డేట్స్ మర్చిపోయారా... ఈ ఏడాదికి మీకు తిరుమల వెంకన్న దర్శన భాగ్యం లేనట్టే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Embed widget