అన్వేషించండి

Breaking News Live: కర్ణాటకలో బస్సు బోల్తా, ఎక్కువ సంఖ్యలో మృతులు!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Key Events
AP Budget Sessions Hyderabad Flyovers closed AP Telangana Breaking News Live Updates Breaking News Live: కర్ణాటకలో బస్సు బోల్తా, ఎక్కువ సంఖ్యలో మృతులు!
ఏపీ, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

Background

ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య నెలకొన్ని యుద్ధ వాతావరణం పలు దేశాల మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గరిష్ట ధరలకు చేరుకుంటున్నాయి. తాజాగా బంగారం ధర పెరిగింది. రూ160 మేర పెరగడంతో హైదరాబాద్‌లో తాజాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,450 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.51,760 కి ఎగబాకింది. స్వచ్ఛమైన వెండి ధర రూ.600 మేర పుంజుకోవడంతో నేడు హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.72,900 కు చేరింది.

ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు మూడు రోజుల తరువాత నేడు పెరిగాయి. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 18th March 2022)  10 గ్రాముల ధర రూ.51,760 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450కి చేరింది. విజయవాడలో వెండిపై రూ.600 తగ్గడంతో 1 కేజీ ధర రూ.72,900 కి పతనమైంది. విశాఖపట్నం, తిరుపతిలో రూ.150 మేర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,450 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.72,900 అయింది.  

ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న వేడిగాలుతో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం పొడిగా మారింది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వేర్వేరు ప్రకటనల్లో హెచ్చరించాయి. మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో మార్చి 16న అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతూ 19వ తేదీన తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ అల్పపీడనం మరింతగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  

ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మధ్యాహ్నం ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ నగరంలో ఉక్కపోత మరింత ఎక్కువైంది. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడంతో ఉక్కపోత అధికం కానుంది. నేటి నుంచి రెండు రోజులపాటు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణం పొడిగా మారుతుంది. కొన్నిచోట్ల వడగాల్పులు వీచడంతో ఉక్కపోత అధికం. ప్రజలు వేడిని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వాతావరణ కేంద్రం పేర్కొంది. 

హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు సైతం పెట్రోల్ ధర లీటర్ (Petrol Price Today 18th March 2022) రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 102 డాలర్లకు దిగొచ్చింది. 

ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర పెరిగింది.  వరంగల్‌లో 46 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.107.69 కాగా, డీజిల్‌‌పై 43 పైసలు దిగిరావడంతో లీటర్ ధర రూ.94.14 కు పతనమైంది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.107.88 కాగా, డీజిల్‌‌  లీటర్ ధర రూ.94.31 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు నేడు నిలకడగా ఉన్నాయి. 

విజయవాడలో పెట్రోల్‌ పై 56 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.91 కాగా, ఇక్కడ డీజిల్ పై 52 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.96 అయింది. 
విశాఖపట్నంలో ఇంధన ధరలు తగ్గాయి. 50 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.40 అయింది. డీజిల్‌పై 46 పైసలు పెరిగి లీటర్ ధర రూ.95.51గా ఉంది. చిత్తూరులో ఇంధన ధరలు భారీగా దిగొచ్చాయి. పెట్రోల్‌ పై 72 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.110.46కి పతనమైంది. డీజిల్ పై 64 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.96.52 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. 

10:35 AM (IST)  •  19 Mar 2022

Karnataka Bus Accident: కర్ణాటకలో బస్సు బోల్తా, ఎక్కువ సంఖ్యలో మృతులు!

కర్ణాటకలో YNH కోట నుంచి పవగడకు వెళుతున్న SVT బస్సు బోల్తా పడింది. దాదాపు 15 మంది వరకు మరణించినట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

17:54 PM (IST)  •  18 Mar 2022

Accident: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం

హైదారాబాద్‌లోని గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లా హోటల్‌ సమీపంలో ప్రమాదం జరిగింది. స్పీడ్‌గా దూసుకొచ్చిన కారు మహిళలపైకి దూసుకెళ్లింది. ఆ యాక్సిడెంట్‌లో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ 28 సీఎల్1134 నెంబర్‌తో ఉన్న ఫోర్డు కారు మహిళను ఢీ కొట్టి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది.  

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Embed widget