అన్వేషించండి

Breaking News Live: విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల మదింపునకు కేంద్రం ఉత్తర్వులు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల మదింపునకు కేంద్రం ఉత్తర్వులు

Background

ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో పొడి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.

‘‘ఆంధ్రప్రదేశ్, యానాంలో తక్కువ ఎత్తులో ప్రధానంగా ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా వచ్చే మూడు రోజుల వరకూ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితిని ఇలా ఉండనుంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వచ్చే 3 రోజులు వాతావరణం పొడిగా ఉండనుంది. దక్షిణ కోస్తా, యానాం ప్రాంతాల్లో నూ వాతావరణ పొడిగానే ఉండనుంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగా ఉంటుంది. వర్షాలకు సంబంధించిన గానీ, ఎండలకు సంబంధించిన గానీ ఎలాంటి హెచ్చరికలూ లేవు’’ అని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు.

‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తూర్పు తెలంగాణ రాష్ట్రంలోని చాలా భాగాల్లో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలోని జగ్గంపేట​ - తాడేపల్లిగూడం పరిధిలో, తెలంగాణ భద్రాచలం, సూర్యాపేట​, ఖమ్మంలో ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. ఈ ఎండల తీవ్రత ఉండగా, మనం నీటిని తాగడం చాలా మంచిది. మార్చి 13 నుంచి ఎండలు మరింత ఎక్కువ అవుతాయి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

తెలంగాణలో ఇలా.. (Telangana Weather Update)
తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట​, భద్రాద్రి కొత్తగూడం జిల్లాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉండనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మార్చి 13 నుంచి వడగాల్పులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 33, 34 డిగ్రీల మేర నమోదు అవుతున్నాయి.

బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) బాగా తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరుగుతున్న సంగతి తెలిసిందే. వెండి ధర కూడా నేడు బాగా తగ్గింది. కిలోకు ఏకంగా రూ.2,600 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.48,200 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,580 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.74,100 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.76,700 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర అంతే పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.48,200 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,580గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.74,100 గా ఉంది.

22:43 PM (IST)  •  11 Mar 2022

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల మదింపునకు కేంద్రం ఉత్తర్వులు

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల మదింపు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు ఆహ్వానించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ఒక్కొ అడుగు ముందుకెస్తుంది. ఉక్కు కర్మాగారం ఆస్తుల విలువ కట్టడానికి ప్రతిపాదనలకు ఆహ్వానం పలుకుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ఆర్ధిక శాఖ. 

22:43 PM (IST)  •  11 Mar 2022

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల మదింపునకు కేంద్రం ఉత్తర్వులు

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల మదింపు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు ఆహ్వానించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ఒక్కొ అడుగు ముందుకెస్తుంది. ఉక్కు కర్మాగారం ఆస్తుల విలువ కట్టడానికి ప్రతిపాదనలకు ఆహ్వానం పలుకుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ఆర్ధిక శాఖ. 

14:44 PM (IST)  •  11 Mar 2022

యశోద ఆసుపత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జ్

యశోద ఆసుపత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం ఉదయం ఆయన స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేసీఆర్ కు వైద్యులు సూచించారు. 

14:10 PM (IST)  •  11 Mar 2022

Food Poison: నంద్యాల ప్రభుత్వ పాఠశాలలో పుడ్ పాయిజన్, ఆసుపత్రిలో 30 మందికి చికిత్స

కర్నూలు జిల్లా.....

నంద్యాల ప్రభుత్వ పాఠశాలలో పుడ్ పాయిజన్

నంద్యాల విశ్వనగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాల లో  మధ్యాహ్నం భోజనం వికటించి 30 మంది విద్యార్థులకు అస్వస్థత.

చికిత్స నిమిత్తం  నంద్యాల ప్రభుత్వ వైద్య శాలకు తరలింపు.

అదోళన లో  విద్యార్థుల తల్లిదండ్రులు.

నంద్యాల ఆసుపత్రిలో విద్యార్థులకు కొనసాగుతున్న వైద్యం

11:33 AM (IST)  •  11 Mar 2022

CM KCR: సీఎం కేసీఆర్‌కు అస్వస్థత, యాదాద్రి పర్యటన రద్దు - యశోద ఆస్పత్రిలో కీలక వైద్య పరీక్షలు

ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు అయింది. ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌కు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు చేసినట్లుగా తెలుస్తోంది.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Embed widget