అన్వేషించండి

AP News: జగన్ ప్రభుత్వ అవినీతిపై మొదట్నుంచీ పోరాడుతున్నాం, వైసీపీని సపోర్ట్ చేయలేదు: సోము వీర్రాజు

వైసీపీ ప్రభుత్వ అవినీతిపై భారతీయ జనతా పార్టీ మొదట్నుంచీ పోరాడుతూనే ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేప్పారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవినీతిపై భారతీయ జనతా పార్టీ మెదటి నుంచి పోరాటం సాగిస్తూనే ఉందని రాష్ట్ర అధ్యక్షుడు సొము వీర్రాజు తెలిపారు. తాము ఏనాడూ వైసీపీ ప్రభుత్వాన్ని సమర్ధించిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.

దూకుడు పెంచుతున్న కమలం...
బీజేపీ అగ్రనేతలు ఏపీలో పర్యటించిన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మరింత దూకుడు పెంచారు. బీజేపీ ఏనాడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిని సమర్థించలేదని సోమువీర్రాజు పేర్కొన్నారు. కేంద్ర హోంమత్రి అమిత్‌షా, భారతీయ జనతా పార్టి జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డా ఇటీవల విశాఖ, శ్రీకాళహస్తి బహిరంగసభల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై చేసిన విమర్శలు, ఆరోపణల పై తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. బీజేపీ ఇప్పుడు కొత్తగా మాట్లాడటం లేదుని ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నామన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ను బీజేపీ ఎప్పుడూ సమర్ధించలేదని తెలిపారు.

ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం పై యువమోర్చా ఉద్యమం చేపడితే కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ వచ్చి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం మాఫియా పై తీవ్ర విమర్శలు చేశారని గుర్తుచేశారు. జేపీ నడ్డా జూన్‌లో విజయవాడ, రాజమండ్రిలో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలపై ఘాటుగా విమర్శించారని గుర్తుచేశారు. అలాగే ప్రకాష్‌ జవదేకర్‌ కూడా జగన్‌ అవినీతిపై స్పందించి జైలుకు వెళ్లే అవకాశం ఉందంటూ ఆరోపించిన విషయాలను సైతం సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఇక శ్రీకాళహస్తిలో నడ్జా, విశాఖలో అమిత్‌షాలు రాష్ట్ర ప్రభుత్వ దోపిడి, కుంభకోణాలపై ఘాటుగా స్పందించి విమర్శించారని చెప్పారు.

మత వివక్షను కొనసాగిస్తోంది...
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మత వివక్ష కొనసాగిస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు.  హిందూ ధర్మంపై దాడులు జరిగితే ఉపేక్షించి నిందితులను వెనకేసుకొచ్చిందని మండిపడ్డారు. రామతీర్ధం ఘటన పై బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసిందని తెలిపారు.  

బీజేపీపై బురద చల్లే ప్రయత్నం...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దురుద్దేశంతో బీజేపీపై  బురద జల్లాలని చూస్తోందని సోము వీర్రాజు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వతో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టి కలసి ఉన్నట్లు, ఇక పై ఉండదేమో అనే అనుమానాన్ని ముఖ్యమంత్రి జగన్‌ వ్యక్తం చేయడం వ్యూహంతో కూడిన వంచనగా వీర్రాజు పేర్కొన్నారు. బీజేపీ ఎప్పుడు మీతో ఉందో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైసీపీకి సహకరించని కారణంగా అభ్యంతరకరమైన సంబోధనతో పవన్‌ కల్యాణ్‌ను జగన్‌ విమర్శించడంతో ఆ పార్టీతో మిత్రపక్షంగా ఉన్న  పార్టీగా బీజేపీ, జగన్‌ను విమర్శిస్తోందన్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పై అభ్యంతరకరంగా  పద ప్రయోగాలు చేసే అర్హత ముఖ్యమంత్రికి లేదన్నారు.

కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటూనే వ్యాఖ్యలు...
కేంద్రం నుంచి అవసరమైనన్ని నిధులు తెచ్చుకుంటూ వాటిని దారి మళ్లించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మజా చేసుకుందని సోము వీర్రాజు ఆరోపించారు. విమర్శించినపుడు ఎదురు మాట్లాడక ప్రజల్ని ఏమార్చేలా జగన్‌ వ్యూహం అమలు చేస్తున్నారని అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఈ నెలాఖరులో  వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌కి కృష్ణా జలాలు 
ఈ నెలాఖరులో  వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌కి కృష్ణా జలాలు 
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
YS Jagan: శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget