అన్వేషించండి

Purandeswari: టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కీలక భేటీకి గైర్హాజరు, పురంధేశ్వరి ఏమన్నారంటే!

Andhra News: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూటమి నేతల కీలక భేటీకి హాజరు కాలేదు. దాంతో ఆమె ఎందుకు ఈ సమావేశాలకు హాజరు కాలేదని చర్చ జరుగుతోంది.

AP BJP Chief Purandeswari: అమరావతి: ఏపీలో సీట్ల కేటాయింపులపై, అభ్యర్థుల పేర్ల ఖరారుపై కూటమి నేతలు సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. టీడీపీ నుంచి చంద్రబాబు, అచ్చెన్నాయుడు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, పార్టీ జాతీయ నేత బైజయంత్‌ పండా భేటీలో పాల్గొన్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూటమి నేతల కీలక భేటీకి హాజరు కాలేదు. దాంతో ఆమె ఎందుకు ఈ సమావేశాలకు హాజరు కాలేదని చర్చ జరుగుతోంది. ఈ విషయంపై పురంధేశ్వరి స్పందించి వివరణ ఇచ్చారు.

పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది.. 
పొత్తులపై బీజేపీకి ప్రొసీజర్ ఉంటుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కీలక భేటీకి తాను చర్చలకు వెళ్ళకపోవడానికి ప్రత్యేక కారణం ఏమి లేదన్నారు. అభ్యర్థుల ఎంపిక, పొత్తుల అంశంపై పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు రాష్ట్ర పార్టీ నేతలు, శ్రేణులు కట్టుబడి ఉంటాయన్నారు. నిన్న (మార్చి 10న) పవన్ కళ్యాణ్ తో చర్చించారని, నేడు (మార్చి 11న) చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. నేటి చర్చల సారాంశాన్ని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామన్నారు. బీజేపీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు నాయకులు.. పొత్తులపై పోటీ చేసే అంశంలో బీజేపీ కార్యకర్తలు ఎవ్వరూ ఆందోళనలో లేరని పేర్కొన్నారు. కేంద్ర నాయకత్వం నిర్ణయం మేరకు అన్ని జరుగుతాయి, మా పార్టీ సిద్ధాంతాలతో ఏకీభవించి ఎవ్వరూ పార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ పొత్తులు 
టీడీపీ, జనసేనతో పొత్తు ఖరారు కావడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆదివారం నాడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దుష్టపాలనకు చరమగీతం పాడాలంటే వైసీపీని ఓడించడం ఒక్కటమే మార్గమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. విజయవాడలో బీజేపీ మేనిఫెస్టో రథాలను ఆదివారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మేనిఫెస్టో తయారీలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాష్ట్రం కోసం ఒకటి, కేంద్రం నుంచి ఏం ఆశిస్తున్నారని రెండు బాక్సులతో బీజేపీ ప్రచార రథాలు పంపిస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు బీజేపీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Embed widget