Breaking News Live: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 12న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం ఆమడగూరు మండలం మొలకవారిపల్లి ఎగువ తాండలో విషాదం చోటుచేసుకుంది. నిన్న చెరువులో గల్లంతైన ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్నారుల మృతదేహాలను కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాల వెలికితీతకు వర్షంలో రాత్రంతా పోలీసులు, గ్రామస్థులు శ్రమించారు.
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కి కరోనా సోకింది. గత రెండు మూడు రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్న మంత్రి గంగుల ఇబ్బంది పడుతున్నారు. నేడు జరిగిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా ఆయనను నేరుగా కలిసిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఈటల రాజేందర్ పై ఎన్నికల కమిషన్ కు టీఆర్ఎస్ ఫిర్యాదు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అసత్య ఆరోపణలు చేశారని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ పార్టీ, పార్టీ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై బీజేపీ అభ్యర్థి దుష్ప్రచారం చేస్తూ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నేత జగన్ పై బీజేపీ నేతల దాడి చేశారని మరోవైపు ఫిర్యాదు హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించి సభ నిర్వహించడంతో పాటు టీఆర్ఎస్ డబ్బులు ఇస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తీసుకోమని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటర్లును తప్పుదోవ పట్టించడం, టీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎన్నికల కమిషన్ కు తెలిపారు.
ప్రకాష్ రాజ్ ఫ్యానల్ 11 మంది సభ్యులు రాజీనామాా
ప్రకాష్ రాజ్ ఫ్యానల్ 11 మంది సభ్యులు రాజీనామాా చేశారు. మా ఎన్నికల్లో రౌడీయిజం చేశారని నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. రెండేళ్లు మంచు విష్ణు బాగా పనిచేయాలని కోరారు. ముందు రోజు గెలిచిన వాళ్లు తరవాతి రోజు ఓడిపోయారని తెలిపారు. రాజీనామా ఎమోషనల్ నిర్ణయం కాదని ఆయన అన్నారు. మా బై లాస్ మార్చనని మంచు విష్ణు హామీ ఇస్తే తన రాజీనామా వెనక్కి తీసుకుంటానని ప్రకాష్ రాజ్ చెప్పారు.
బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న సీఎం జగన్ కు రాష్ట్ర మంత్రులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారు సరస్వతీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
మమతా బెనర్జీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం..
పశ్చిమ బెంగాల్ సచివాలయంలోని 14 వ అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యాలయంలో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం సమయంలో 14 వ అంతస్తు నుంచి పొగలు రావడాన్ని గమనించారు సిబ్బంది. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేశాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణలపై దర్యాప్తు చేస్తున్నారు.