అన్వేషించండి

Chandrababu Anna Canteen: పేదల ఆకలి తీర్చేందుకు గ్రామీణ ప్రాంతాలకూ అన్న క్యాంటీన్లు - 15న ప్రారంభించనున్న సీఎం

Anna canteens: కూలీలు, కార్మికులు , పేదలెవరూ ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్ల సేవలను మరింత విస్తరిస్తోంది. ఈనెల 15వ తేదీన ధరణికోటలో అధికారికంగా ప్రారంభించనున్నారు.

Anna Canteen Dharanikota: కూలీలు, కార్మికులు , పేదలెవరూ ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్ల సేవలను మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో విజయవంతంగా నడుస్తున్న ఈ పథకాన్ని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ చేరవేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 62 గ్రామీణ అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రెండో విడత క్యాంటీన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 15వ తేదీన పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గంలోని ధరణికోటలో అధికారికంగా ప్రారంభించనున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 207 అన్న క్యాంటీన్లు ఉండగా, కొత్తగా ప్రారంభించే వాటితో కలిపి ఈ సంఖ్య 269కి చేరనుంది. గత ప్రభుత్వం నిలిపివేసిన ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరించింది. కేవలం రూ. 5లకే నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించడం ద్వారా పేదలకు పెద్ద ఊరటనిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 8.80 కోట్ల మంది పేదలు ఈ క్యాంటీన్ల ద్వారా భోజనం చేశారు. ప్రతిరోజూ సుమారు 2.10 లక్షల మంది ఈ సేవలను వినియోగించుకుంటుండగా, దీని కోసం ప్రభుత్వం భారీగా సబ్సిడీని వెచ్చిస్తోంది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న 207 క్యాంటీన్ల సబ్సిడీ కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 243 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న 62 గ్రామీణ క్యాంటీన్ల సబ్సిడీ కోసం ఏటా అదనంగా మరో రూ. 58 కోట్లు వెచ్చించనుంది. ఒక్కో క్యాంటీన్‌లో సగటున రోజుకు 1,000 మందికి పైగా భోజనం చేస్తున్నారని, సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వం ఈ వ్యయాన్ని భరిస్తోందని అధికారులు వెల్లడించారు.  అందరికీ ఆహార భద్రత అనే నినాదంతో గ్రామీణ పేదలకు కూడా చేరువవ్వడమే ఈ విస్తరణ ప్రధాన ఉద్దేశం.

 బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ఆయన ధరణికోట చేరుకుంటారు. 1.30 గంటలకు కొత్త అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం, అక్కడ లబ్ధిదారులతో కలిసి భోజనం చేయనున్నారు. పట్టణాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే గ్రామీణులు, స్థానిక కూలీలకు ఈ కొత్త క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ పర్యటన కోసం పల్నాడు జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ దాడులు..!
వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ దాడులు..!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Embed widget