Nara Lokesh meets the President: పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
Nara Lokesh : రాష్ట్రపతితో నారా లోకేష్ భేటీ అయ్యారు. అమరావతిని రాజధానిగా నోటిఫై చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Nara Lokesh met President Murmu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ , ఎన్డీఏ ఎంపీలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆమెను కలిసిన లోకేష్, ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన అమరావతికి రాజముద్ర వేసి శాశ్వతత్వం కల్పించినందుకు రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా అమరావతి చరిత్ర, సంస్కృతి , మాస్టర్ ప్లాన్ వివరాలతో కూడిన ప్రత్యేక పుస్తకాన్ని ఆమెకు అందజేశారు.
రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కేవలం 58 రోజుల్లోనే 34 వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతుల గొప్పతనాన్ని లోకేష్ రాష్ట్రపతికి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, మొక్కవోని దీక్షతో శాంతియుతంగా పోరాడారని ఆయన గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి పనులు, ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాతే శరవేగంగా పునఃప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
It was a privilege to meet Hon’ble President Smt. Droupadi Murmu ji and convey the heartfelt gratitude of crores of people of Andhra Pradesh for approving the Bill that notifies #Amaravati as our capital.
— Lokesh Nara (@naralokesh) April 13, 2026
She graciously acknowledged the extraordinary resilience and sacrifice of… pic.twitter.com/TWM5qs3y12
రైతుల త్యాగాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడుతూ, రాష్ట్రంపై ప్రేమతో భూములిచ్చిన రైతుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న విజయాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని, తన హయాంలోనే అమరావతి చట్టం రూపొందడం సంతోషకరమని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనించాలని, రాజధాని పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు.
Amaravati permanent legal status - Minister Nara Lokesh expresses gratitude to President Droupadi Murmu on behalf of 5 crore people.
— Amaravati News24 (@amaravatinews24) April 13, 2026
🇮🇳 Leaders say the decision fulfills the dream: “Our State Andhra Pradesh – Our Capital Amaravati.”
🏗️ Background & Development
📉… pic.twitter.com/ZKLe18neKt
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్ అని, ఆయన దూరదృష్టితో రాజధాని అమరావతి అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఈ చట్టం ఒక కొత్త భరోసాను ఇస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు. అమరావతిని అజరామరం చేసిన ఈ ఘట్టం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని మంత్రి లోకేష్ ప్రశంసించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















