అన్వేషించండి

Nara Lokesh: 'అది సర్కారీ హత్యే' - ప్రభుత్వానికి ఆర్టీసీ ఆస్తులపై ఉన్న శ్రద్ధ నిర్వహణపై లేదని నారా లోకేశ్ ఆగ్రహం

Andhrapradesh News: ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల నిర్వహణ విషయంలో అలసత్వం వహిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ కు ఆస్తులపై ఉన్న శ్రద్ధ నిర్వహణపై లేదని విమర్శించారు.

Nara Lokesh Slams CM Jagan: సీఎం జగన్ కు (CM Jagan) ఆర్టీసీ ఆస్తులపై ఉన్న శ్రద్ధ, బస్సుల కొనుగోలు, నిర్వహణపై లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. భీమవరం (Bhimavaram) సమీపంలోని వీరవాసరంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి దూసుకెళ్లడంతో ధాన్యం వ్యాపారి మృతి చెందిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. 'విజయవాడ ఆర్టీసీ బస్టాండులో బస్సు ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లి ముగ్గురు అమాయకులు బలయ్యారు. ఈ దుర్ఘటన మరవక ముందే భీమవరం సమీపంలోని వీరవాసరంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి దూసుకెళ్లడంతో ధాన్యం వ్యాపారి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో బైక్ తో సహా సదరు వ్యాపారి బస్సు కింద ఇరుక్కుపోగా దాదాపు గంట తర్వాత పొక్లెయిన్‌ సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. ప్రమాదానికి గురైన బస్సు బ్రేకుల్లో సమస్య ఉన్నట్లు డ్రైవర్లు ముందుగా చెప్పినా.. స్పేర్ పార్టులకు డబ్బుల్లేవని మరమ్మతులతో సరిపెట్టిన దివాలాకోరు ప్రభుత్వమిది. ఇది కచ్చితంగా సర్కారీ హత్యే.' అని లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం మృతుడి కుటుంబానికి పరిహారం అందించాలని, ఆర్టీసీ గ్యారేజీల్లో మెయింటెనెన్స్‌కు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ జరిగింది

ప.గో జిల్లా వీరవాసరంలో శుక్రవారం అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి వాహనంతో సహా బస్సు కింద ఇరుక్కుపోయి మృతి చెందారు. దాదాపు గంట తర్వాత పొక్లెయిన్‌ సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. పాలకొల్లు నుంచి భీమవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరవాసరం తహసీల్దారు కార్యాలయం సమీపంలో అదుపు తప్పి కుడివైపు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న బైక్ ను, పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగింది. ఈ ఘటనలో పాలకొల్లు మండలం తిల్లపూడి వాసి, ధాన్యం వ్యాపారి కాజ శ్రీనివాసరావు (52) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు భీమవరం డిపోకు చెందినది. బ్రేకుల్లో సమస్య ఉన్నట్లు గుర్తించిన డ్రైవర్లు అధికారులకు సమాచారం ఇవ్వగా కీలకమైన విడిభాగాలు మార్చకుండా రెండుసార్లు మరమ్మతులతో సరిపెట్టినట్లు సమాచారం. తాజాగా బ్రేకుల విడిభాగాలను సర్దుబాటు చేయగా, అవి విఫలమై ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

జగన్నాటకాలకు యువత బలి

సీఎం జగన్ ఆడే నాటకాలకు యువతి బలవుతోందని నారా లోకేశ్ మండిపడ్డారు. ఉద్యోగాల విషయంలో జగన్ మాయమాటలు నమ్మి రాష్ట్రంలో యువత మోసపోయిందన్నారు. 'ఏటా జనవరి 1నే జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఇచ్చారా? ఏటా 2 లక్షలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ అన్నారు.. ప్రకటించారా?' అని లోకేశ్‌ ప్రశ్నించారు. ఉద్యోగాలు రాక.. ఉపాధి లేక యువత తీవ్ర ఆందోళనలో ఉందన్నారు. జగన్‌ పాలనలో టీచర్‌ పోస్టుల భర్తీకి ఒక్క ప్రకటనా రాలేదన్నారు. ఉద్యోగాలు రాలేదని యువత ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని లోకేశ్‌ కోరారు.

టీడీపీ - జనసేన మేనిఫెస్టో కమిటీ

టీడీపీ - జనసేన జేఏసీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీని మొత్తం ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కమిటీలో ఉన్నారు. ఈ నెల 13న ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ఈ కమిటీ భేటీ కానుంది.

Also Read: CM Jagan: 'మైనారిటీల అభివృద్ధికి పెద్దపీట' - సాధికారత చేతల్లో చూపించామన్న సీఎం జగన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget