AP TS Corona Updates: ఏపీలో తగ్గిన కరోనా కేసులు... కొత్తగా 693 కరోనా కేసులు, 6 మరణాలు... తెలంగాణలో 201 కొత్త కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 693 కరోనా కేసులు నమోదయ్యాయి. 6 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో 8310 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 48,235 నమూనాలను పరీక్షించగా 693 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. కరోనా నుంచి గురువారం 927 మంది కోలుకున్నారని ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,310 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది. కొవిడ్ వల్ల కృష్ణాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,86,60,811 నమూనాలను పరీక్షించింది.
#COVIDUpdates: As on 08th October, 2021 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 8, 2021
COVID Positives: 20,53,104
Discharged: 20,30,552
Deceased: 14,242
Active Cases: 8,310#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Ot8IaeTEyv
తెలంగాణలో కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 47,465 కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 201 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు 6,67,535కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కొవిడ్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఒక్కరు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 3,927 మంది మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో 220 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,59,263కి చేరింది. తెంలగాణలో 4,345 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
Also Read: రెండు డోసులు టీకా వేసుకున్నారా? కానీ బూస్టర్ డోసు తప్పదట!
దేశంలో తగ్గుతున్న కొవిడ్ వ్యాప్తి
దేశంలో కరోనా వ్యాప్తి కాస్త తగ్గింది. కొత్త కేసులు, మరణాల్లో తగ్గుదల నమోదయ్యింది. అయితే క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గాయి. దీంతో కొవిడ్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 205 రోజుల కనిష్టానికి చేరుకుంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 13,85,706 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 21,257 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 271 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ మొత్తం కేసులు 3.39 కోట్లకు చేరగా, 4,50,127 మంది ప్రాణాలు కోల్పోయారు.
India reports 21,257 fresh infections in the last 24 hours, active caseload at 2,40,221; lowest in 205 days: Ministry of Health and Family Welfare pic.twitter.com/QrQpMyee8N
— ANI (@ANI) October 8, 2021
వేగంగా వ్యాక్సినేషన్
దేశంలో 2,40,221 క్రియాశీలక కొవిడ్ కేసులు ఉన్నాయి. ఈ రేటు 0.71 శాతానికి తగ్గింది. రికవరీ రేటు కూడా పెరిగింది. గురువారం 24,963 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.32 కోట్లుగా ఉంది. గురువారం దేశంలో 50.17 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల 93 కోట్లకు చేరింది.
Also Read: పిల్లల భద్రతపై కేంద్రం కొత్త రూల్స్.. పాటించకపోతే పాఠశాలల పని అంతే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి