AP TS Corona Updates: ఏపీలో తగ్గిన కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 478 కొత్త కేసులు, 6 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 478 కరోనా కేసులు నమోదయ్యాయి. 6 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో 5,398 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తికి క్రమంగా తగ్గుతోంది. తాజాగా 12 జిల్లాల్లో వందకన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. రెండు జిల్లాల్లో కేసులు పదిలోపు వచ్చాయి. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,494 నమూనాలను పరీక్షించగా 478 మందికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా కోవిడ్ బులెటిన్ విడుదల చేసింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 119 కేసులు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 10 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో 20 మందిలోపు పాజిటివ్ కేసులు వచ్చాయి.
#COVIDUpdates: 22/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 22, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,59,886 పాజిటివ్ కేసు లకు గాను
*20,40,155 మంది డిశ్చార్జ్ కాగా
*14,333 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,398#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/x0ghP1vfrV
Watch: వంద కోట్ల మందికి కరోనా టీకా.. వైభవంగా సంబరాలు
రాష్ట్రంలో 5,398 యాక్టివ్ కేసులు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,62,781కి చేరింది. వీరిలో 20,43,050 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 574 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 5,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 28, అనంతపురం జిల్లాలో 76, విజయనగరం జిల్లాలో 37, శ్రీకాకుళం జిల్లాలో 99, విశాఖపట్నం జిల్లాలో 110, కడప జిల్లాలో 171, పశ్చిమగోదావరి జిల్లాలో 280 క్రియాశీలక కేసులున్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఆరుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,333కు చేరింది. కృష్ణా జిల్లాలో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2,91,85,656 నమూనాలను పరీక్షించారు.
Also Read: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు.. మరో ఆరుగురిని అరెస్టు చేసిన సీబీఐ
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు మరోసారి 15 వేలకు పైన నమోదయ్యాయి. కొత్తగా 15,786 కోవిడ్ కేసులు నమోదు కాగా 231 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,75,745 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళలో కొత్తగా 8,733 కరోనా కేసులు నమోదయ్యాయి. 118 మంది మృతి చెందారు. కేరళలో మొత్తం కేసుల సంఖ్య 48,79,317కు పెరిగింది. ఇప్పటివరకూ 27,202 మంది మరణించారు.
Watch: వ్యాక్సినేషన్‌లో చరిత్ర సృష్టించిన భారత్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి