AP TS Corona Updates: ఏపీలో కొత్తగా 231 కరోనా కేసులు, ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 231 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో 3,233 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 31,ద54 మంది శాంపిల్స్ పరీక్షించగా 231 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో ఇద్దరు మృతి చెందారు. కరోనా నుంచి సోమవారం 362 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,233 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యా ఆరోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కోవిడ్ వల్ల గుంటూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
#COVIDUpdates: As on 09th November, 2021 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 9, 2021
COVID Positives: 20,65,823
Discharged: 20,48,187
Deceased: 14,403
Active Cases: 3,233#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/5HSO6vroWY
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,68,718కి చేరింది. వీరిలో 20,51,082 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 362 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 3,233 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,403కు చేరింది.
Also Read: యునెస్కో క్రియేటివ్ సిటీస్ జాబితాలో శ్రీనగర్.. క్రాఫ్ట్స్, జానపద కళల కేటగిరీలో స్థానం
దేశంలో కరోనా కేసులు
కరోనా వైరస్ ను తొలిరోజుల్లో సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశాలలో భారత్ ఒకటి. కానీ పూర్తి స్థాయిలో కొవిడ్ కు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. నేటికీ కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 10,126 కొత్త కేసులను గుర్తించారు. క్రితం రోజుతో పోల్చితే కరోనా కేసులు తగ్గాయి. నిన్న ఒక్కరోజులో 332 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రితం రోజుతో పోల్చితే కొవిడ్ మరణాలు సైతం భారీగా పెరిగాయి. దేశంలో ఇప్పటివరకూ 4,61,389 మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం 1,40,638 (ఒక లక్షా 40 వేల 638) యాక్టివ్ కేసులున్నాయి. కాగా, గత 263 రోజులలో ఇవే అతి తక్కువ క్రియాశీల కేసులు. మరోవైపు నిన్న ఒక్కరోజులో 11,982 మంది కరోనా మహమ్మారిని జయించారు. దాంతో కొవిడ్19 రికవరీ రేటు 98.25 శాతానికి చేరింది. మొత్తం కరోనా కేసులలో యాక్టివ్ కేసులు 0.42 శాతం ఉంది.
Also Read: మనసు స్థిరంగా లేదా, ఆందోళనగా అనిపిస్తోందా... వీటిని తినండి