(Source: ECI/ABP News/ABP Majha)
Corona Updates: ఏపీలో కొత్తగా 166 కోవిడ్ కేసులు, రెండు మరణాలు
ఏపీలో కొత్తగా 166 కరోనా కేసులు నమోదయ్యారు. గడచిన 24 గంటల్లో కోవిడ్ తో ఇద్దరు చనిపోయారు. రాష్ట్రంలో 1154 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 31,844 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 166 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో రెండు మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,495కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 91 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,61,496 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1154 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: అంబేడ్కర్ వల్ల వచ్చిన హక్కులేమీ లేవు.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి షాకింగ్ కామెంట్స్
#COVIDUpdates: 31/12/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 31, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,74,250 పాజిటివ్ కేసు లకు గాను
*20,58,601 మంది డిశ్చార్జ్ కాగా
*14,495 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,154#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/UoB97L1iel
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,77,145కి చేరింది. గడచిన 24 గంటల్లో 91 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1154 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో రెండు మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,495కు చేరింది.
Also Read: చిన్నప్పుడు వేరుశనక్కాయలు కొని డబ్బులు ఇవ్వలేదని... ఇప్పుడు రూ.25 వేల ఆర్థిక సాయం
దేశంలో కొత్తగా 16,764 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 16,764 కరోనా కేసులు నమోదుకాగా 7,585 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 220 మంది కరోనాతో మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 91,361కి చేరింది. రికవరీ రేటు 98.36%గా ఉంది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1000 దాటింది. ప్రస్తుతం మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,270గా ఉంది.
మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 198 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా ఇందులో 190 ఒక్క ముంబయిలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 450కి చేరింది. మహారాష్ట్రలో కొత్తగా 5,368 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 66,70,754కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,217 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో మహారాష్ట్ర సర్కార్ కొవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంక్షలు విధించింది. గురువారం అర్థరాత్రి ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. గుజరాత్‌లో కొత్తగా 573 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,31,078కి చేరింది. అయితే కొత్తగా ఒక ఒమిక్రాన్ కేసు కూడా నమోదుకాకపోవడం కాస్త ఊరట కలిగిస్తోంది.
Also Read: 2022 కితకితలు.. ఈ న్యూ ఇయర్ మీమ్స్ చూస్తే నవ్వకుండా ఉండలేరు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి