Breaking News Live Updates : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
భారత్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ(శనివారం) గ్రాముకి రూ.40 పెరిగింది. వెండి ధరలు 100 గ్రాములకు రూ.90 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల ధర 10 గ్రాములు రూ.50,950గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవాళ(శనివారం) భారీగా పెరిగాయి. తాజాగా 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకి రూ.40 పెరిగి, హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో 10 గ్రాముల ధర రూ.46,700గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర గ్రాముకి రూ.44 పెరిగి ప్రస్తుతం రూ.50,950(10 గ్రాములు) ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర గ్రాముకి రూ.0.90 పెరిగి హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.65,900(ఒక కేజీ) అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలివే
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల ధర రూ.50,950
దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,860, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,210
ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700,, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950
వెండిధరలు:
భారత మార్కెట్ లో వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రూ.61,700 ఉండగా, చెన్నైలో రూ.65,900గా ఉంది. ముంబయిలో కిలో వెండి రూ.61,700 ఉండగా, కోల్‌కతాలో రూ.61,700, బెంగళూరులో కిలో వెండి రూ.65,900 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,900 ఉండగా, విజయవాడలో రూ.65,900 విశాఖలో రూ. 65,900 వద్ద కొనసాగుతోంది.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Guntur Crime: గుంటూరు పెదపలకలురులోని ఓ కాలేజ్ పై నుండి దూకిన యువతి
గుంటూరు పెదపలకలురులోని ఓ కాలేజ్ పై నుండి దూకిన యువతి.
యువతికి స్వల్ప గాయాలు, జి.జి.హెచ్ కి తరలింపు
డిగ్రీ పరీక్ష రాసేందుకు వచ్చిన యువతి.
గత కొంతకాలంగా యువకుడితో ప్రేమలో ఉన్న యువతి.
ప్రేమ వివాహాన్ని ఒప్పుకోరన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్న పోలీసులు
Fuel Price: వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించింది. పెట్రోల్ పై రూ.9.5, డీజిల్ లీటర్ పై రూ.7 మేర తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ పై రూ.8 తగ్గించగా, డీజిల్ పై రూ.7 మేర తగ్గించినట్లు తెలిపారు.
We are reducing the Central excise duty on Petrol by Rs 8 per litre and on Diesel by Rs 6 per litre. This will reduce the price of petrol by Rs 9.5 per litre and of Diesel by Rs 7 per litre: Union Finance Minister Nirmala Sitharaman
— ANI (@ANI) May 21, 2022
(File Pic) pic.twitter.com/13YJTpDGIf
KCR Delhi Tour: సర్వోదయ స్కూల్‌ను సందర్శిస్తున్న కేసీఆర్, కేజ్రీవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి సర్వోదయ స్కూల్ ను సందర్శిస్తున్నారు. పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న సిఎం కెసిఆర్ బృందానికి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడి సమావేశ మందిరంలో విద్యాభివృద్ధి పై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను సిఎం కెసిఆర్ తిలకిస్తున్నారు. ఢిల్లీలో విద్యాభివృద్ధి దిశగా కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను, స్కూల్ కరికులమ్ లను, అక్కడి అధికారులు సహా ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ సిఎం కెసీఆర్ కు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో.. ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, మంత్రి వేముల ఫ్రశాంత్రెడ్డి ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ తదితరలు పాల్గొన్నారు
MLC Kavitha: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత
జగిత్యాల మార్కెట్ : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కాంగ్రెసోళ్లు రైతు రచ్చబండ పేరుతో గ్రామాలకు వస్తే ప్రకృతివనాలు, డంప్‌యార్డులు, శ్మశాన వాటికలు చూపించాలన్నారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ డ్రామాలు, అందులో పొందుపరిచిన అంశాలను వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో అమలు చేశారో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో అమలు చేయలేనివి తెలంగాణ లో అమలు చేస్తామంటూ చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీజేపీని ఎందుకు విమర్శించరు, పసుపు బోర్డు, ధరల పెరుగుదలపై ఎందుకు విమర్శించరు, ఇరు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్నారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా 50 వేల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీది. దేశంలో ఎక్కడైనా ఇంత పెద్ద మొత్తంలో రైతులకు అందించారా అని ప్రశ్నించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్, బీజేపీలకు లేనే లేదన్నారు.
కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ వద్ద డ్రైవర్‌గా పనిచేసే కాకినాడకు చెందిన వీధి సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితి నేపథ్యంలో కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సుబ్రహ్మణ్యం మృతదేహానికి కాకినాడ జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని.. టీడీపీ నిజనిర్ధారణ బృందం శనివారం ఆసుపత్రికి వెళ్లింది. టీడీపీ నేతలను ఆసుపత్రిలోకి రానివ్వకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే సుబ్రహ్మణ్యం మృతిపై నిజనిజాలు తేలే వరకు పోరాటం కొనసాగుతుందని చెబుతోన్న టీడీపీ నేతలు బారీకేడ్లను తోసుకుంటూ కాకినాడ జీజీహెచ్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.