అన్వేషించండి

AndhraPradesh News: ఆంధ్రా రొయ్య రేటు అదుర్స్ - ఫలించిన ప్రభుత్వ ప్రయత్నాలు, దేశంలోనే మెరుగైన గిట్టుబాటు ధరలు

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌‌లో రొయ్యల పెంపకం లాభసాటిగా మారింది. ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.

AndhraPradesh News: ఆంధ్రప్రదేశ్‌‌లో రొయ్యల పెంపకం లాభసాటిగా మారింది. ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రొయ్యలకు అత్యధిక గిట్టుబాటు ధర లభిస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఆక్వా రైతులకు మెరుగైన గిట్టుబాటు ధరలు దక్కుతున్నాయి. గత జులైలో ప్రాసెసింగ్ యూనిట్లతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ధరలు పెంచడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని వివరించింది. ఈ నేపథ్యంలోనే  ఆక్వా సాధికారత కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రకటించిన ధరలను మరోసారి పెంచేందుకు కంపెనీలు అంగీకరించాయి. 

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఆక్వా రైతులు అందరి కంటే మిన్నగా మెరుగైన ధరనే పొందుతున్నారు. ఏపీలో 100 కౌంట్ ధర రూ.240 పలుకుతుండగా, గుజరాత్, మహారాష్ట్రలో రూ.230 మాత్రమే లభిస్తుంది. అలాగే ఏపీలో 30 కౌంట్ ధర రూ.420 ఉండగా, మహారాష్ట్రలో రూ.400, గుజరాత్, ఒడిశాలో రూ.380గా ఉంది. దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో రొయ్యల ధరలను ప్రతి పది రోజులకోసారి అధికారులు సమీక్షిస్తున్నారు. రైతులకు మెరుగైన ధర అందించడంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిపై ఆక్వా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాలకంటే మిన్నగా.. 

దేశంలో ఒక్క ఏపీలో మాత్రమే కౌంట్‌ల వారీగా ధరలను ప్రకటిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో పూర్వం నుంచి కొనసాగుతున్నట్టుగా ప్రతి 10 కౌంట్లకు ఒక ధర చొప్పున నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకటించిన కౌంట్‌ ధరలు పొరుగు రాష్ట్రాలతో కంటే మెరుగ్గా ఉ­న్నాయి. తమిళనా­డు, ఒడిశా, గు­జరాత్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో ప్రధాన కౌంట్లకు ఏపీ కంటే కేజీకి రూ.5 నుంచి రూ.25 వరకు తక్కువగానే చెల్లిస్తున్నారు.  

రైతు సాధికారత సమితి పర్యవేక్షణలో..

ఆక్వా రైతుల కోసం ఏపీ ప్రభుత్వంలోని రైతు సాధికారత కమిటీ నిరంతరం కృషి చేస్తోంది. ఏ ఒక్క ఆక్వా రైతు నష్టపోకూడదన్న లక్ష్యంతో సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు రైతు సాధికారత కమిటీతో సమావేశం అవుతూ రొయ్యల ధరలను పెంచేందుకు కృషి చేశారు. ఆక్వా రైతుల సమక్షంలో ప్రాసెసింగ్‌ కంపెనీలు, ఎగుమతి దారులతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు జరుపుతున్న చర్చలు మంచి ఫలితమిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కేజీకి రూ.5 నుంచి రూ.10 చొప్పున పెంచేందుకు కంపెనీలు అంగీకరిస్తున్నాయి. పెంచిన ధరలు పది రోజుల పాటు అమలులో ఉంటుండడంతో రైతులకు మేలు జరుగుతోంది. 

అంతే కాకుండా ఏజెంట్లు, షెడ్ల నిర్వాహకుల వద్ద ఆక్వా రైతులు మోసపోతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటిని అడ్డకునేందుకు చర్యలు చేపట్టింది. నిర్దేశించిన ధరల చెల్లింపులో కోత పెడుతున్న ఏజెంట్లు, షెడ్ల నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై రైతుల నుంచి కొనుగోలు చేసే వారెవరైనా కచ్చితమైన బిల్లులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. లేకుంటే అప్సడా చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని, క్రిమినల్‌ కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడబోమని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో ఆక్వా రైతులకు మేలు జరిగినట్లైంది. ఏపీలో ఎక్కువగా నెల్లూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో రొయ్యలు పెంపకం సాగుతోంది.

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Embed widget